Turmeric: వంటింటి చిట్కాలు.. పసుపును వీటితో కలిపి వేస్తే వంటలు మరింత రుచిగా మారతాయ్‌..!

|

Jul 31, 2024 | 8:02 PM

దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో పసుపు ఉంటుంది. బెల్లం, చింతపండు, అల్లం వంటివి కూడా కిచెన్‌లో ఉంటాయి. గుండెల్లో మంట ఉన్నా లేకపోయినా పసుపు తప్పకుండా తీసుకోవాలి. ఈ మసాలా దినుసు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సాధారణ కూరగాయలు, చేపలు, మాంసం, గుడ్లు అన్ని వంటలలో పసుపును ఉపయోగిస్తారు. పాలలో కూడా చిటికెడు పసుపు కలుపుతారు. కానీ పసుపును వీటితో కలిపి తీసుకుంటూ..

1 / 5
దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో పసుపు ఉంటుంది. బెల్లం, చింతపండు, అల్లం వంటివి కూడా కిచెన్‌లో ఉంటాయి. గుండెల్లో మంట ఉన్నా లేకపోయినా పసుపు తప్పకుండా తీసుకోవాలి. ఈ మసాలా దినుసు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సాధారణ కూరగాయలు, చేపలు, మాంసం, గుడ్లు అన్ని వంటలలో పసుపును ఉపయోగిస్తారు. పాలలో కూడా చిటికెడు పసుపు కలుపుతారు. కానీ పసుపును వీటితో కలిపి తీసుకుంటూ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

2 / 5
పసుపును అల్లంతో కలిపి తింటే గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి అల్లం, పచ్చి పసుపును కలిపి పేస్ట్ చేసి రసాన్ని తయారు చేసుకోవాలి. ఈ పానీయం ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపు ఉపయోగించే ఏదైనా వంటలో మిరియాలు కూడా ఉపయోగించవచ్చు. పసుపు, మిరియాలు కలిపి తీసుకుంటే ఇందులోని కర్కుమిన్ శోషణకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఆహారం రుచిని కూడా పెంచుతుంది.

3 / 5
పాలలో పసుపు, మిరియాల పొడి కలిపి తీసుకుంటే మేలు జరుగుతుంది. కానీ కొబ్బరి పాలు అయితే ఇంకా ప్రయోజనాలు పొందవచ్చు. కొబ్బరి పాలలో పసుపు కలపడం వల్ల ఆహారానికి మరింత రుచి చేకూరడంతోపాటు, ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.

4 / 5
కాలీఫ్లవర్ వండేటప్పుడు తప్పనిసరిగా పసుపు వాడాలి. పసుపు, జీలకర్ర, ఇతర మసాలా దినుసులతో కూర వండటం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. దానితో పుష్టిగా ఉంటుంది.

5 / 5
మాంసాన్ని మెరినేట్ చేసేటప్పుడు పెరుగు ఉపయోగించవచ్చు. ఇందులో పసుపు పొడిని కలపడం మర్చిపోవద్దు. పెరుగు రుచిని పసుపు సమతుల్యం చేస్తుంది. కాబట్టి పసుపును పెరుగుతో కూడా కలిపి తినవచ్చు. ఏదైనా కూరగాయను వండేటప్పుడు వెల్లుల్లితో పాటు పసుపును తప్పకుండా వాడాలి. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.