
పొలం పనులు చేసే వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు చిన్న ఆరోగ్య సమస్యలకే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అయినా కూడా తగ్గవు. ఈ పాత కాలం చిట్కాతో మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు. దీని కోసం డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే నయం చేసుకోవచ్చు.

కొందరు మోకాళ్ళ నొప్పులు, కీళ్ల వాపులను లైట్ తీసుకుంటారు ఇవే పెద్ద సమస్యలుగా మారితే నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. దీనికోసం నేచురల్ గా శాశ్వతంగా తగ్గించే ఈ చిట్కాలు మంచిది. వీటితో చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. మరి అస్సలు లేట్ చేయకుండా ఇదెంటి? దీనిని ఎలా వాడాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

నొప్పులు రాగానే ముందు మందులు వాడుతారు మరి ఎక్కువగా వాటి మీదే ఆధారపడకూడదు వీటి వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా ప్రతి దానికి మందులు తీసుకోవడం మంచిది కాదు, ఇక్కడ చెప్పుకునే ఇంటి చిట్కాలు ఫాలో అయితే నొప్పుల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ చిట్కా కోసం పెద్దగా కష్ట పడాల్సిన అవసరం లేదు.

ఒక గిన్నెలో రెండు స్పూన్ల బెల్లం పొడి , ఒక టేబుల్ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ సున్నం కూడా వేసి నీటితో కలపాలి. ఈ మిశ్రమాన్ని కలిపిన తర్వాత నొప్పి ఉన్న చోట రాయాలి. రాసాక 30 నిముషాలు అలా వదిలేయాలి. ఆ తరువాత దీనిని శుభ్రం చేసుకోవాలి. దీనిని రాత్రి సమయంలో రాస్తే ఆ తరువాత రోజు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది

మీరు దీనిని పాటించే ముందు మోకాళ్ళను నీళ్లతో కడిగి బాగా ఆరిన దీనిని రాయాలి అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)