Tulasi Seeds: మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారా.. తులసి సీడ్స్ ను ఇలా తీసుకోండి..
చియా గింజల వలె తులసి గింజల్లో కూడా అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. ఈ విత్తనాల్లో అనేక సుగుణాలున్నాయి. శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలను కలిగి ఉంటాయి. కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం కోసం రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి వివిధ రకాల గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటున్నారు. వైద్యులు కూడా ఇదే సలహా ఇస్తున్నారు కూడా.. వాటిల్లో అవిసె గింజలు, తులసి గింజలు, సబ్జా గింజలు, రకాల కూరగాయల గింజలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శారీరక సమస్యలు రావు.