Herbal Oil: వేసవిలో దురదతో ఇబ్బందులు పడుతున్నారా..? ఈ హెర్బల్ ఆయిల్స్‌తో తక్షణ ఉపశమనం..

|

Apr 25, 2022 | 1:28 PM

Herbal Oils for Itching: వేసవిలో అలసట, చెమటలు పట్టడం, శరీరంపై దద్దుర్లు, మంట, దురద లాంటి సమస్యలు వస్తుంటాయి. చాలా సందర్భాలలో ఈ సమస్య చెప్పుకులేని ప్రాంతాల్లో ఉంటుంది. దీనివల్ల దురద తీవ్రంగా వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ హెర్బల్ ఆయిల్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

1 / 6
వేసవిలో చర్మంపై వేడి దద్దుర్లు సర్వ సాధారణం.. కానీ చికిత్స చేయకుండా వదిలేస్తే దాని వల్ల కలిగే మంట, దురద మిమ్మల్ని చాలా కాలం పాటు బాధపెడుతుంది. డాక్టర్ నుంచి చికిత్స కాకుండా మీరు హెర్బల్ ఆయిల్‌కు సంబంధించిన ఇంటి నివారణ చిట్కాలను పాటించవచ్చు.

2 / 6
గంధపు నూనె: ఈ నూనె చల్లదనాన్ని కలిగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. చాలా బ్రాండ్‌లు మనస్సును హాయిగా.. ప్రశాంతంగా ఉంచడానికి తమ ఉత్పత్తులలో చందనాన్ని కూడా ఉపయోగిస్తాయి. రాత్రి పడుకునే ముందు, గంధపు మూలికల నూనెను నడుము లేదా ప్రిక్లీ హీట్ ద్వారా ప్రభావితమైన ప్రదేశంలో రాయండి.

3 / 6
నీలగిరి తైలం: ఈ నూనె తక్షణమే చల్లదనాన్ని కలిగిస్తుంది. వేడి, మంట నుంచి ఉపశమనం కలిగించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఔషధంగా పని చేస్తాయి.

4 / 6
లవంగం- కర్పూరం నూనె: లవంగాలలో ఉండే ఔషధ గుణాలు ప్రిక్లీ హీట్ వల్ల ప్రభావితమైన చర్మాన్ని రిపేర్ చేయడానికి పని చేస్తాయి. ఒక పాత్ర తీసుకుని అందులో లవంగం నూనె కర్పూరాన్ని వేసి వేడి చేయాలి. ఈ నూనె చల్లారిన తర్వాత కాటన్ సహాయంతో ప్రిక్లీ హీట్ ప్రాంతంలో అప్లై చేయండి.

5 / 6
పుదీనా ఆయిల్: పిప్పరమెంటు కూడా అనేక విధాలుగా శరీరాన్ని చల్లబరిచే ఒక పదార్ధంగా పరిగణిస్తారు. కడుపులో వేడిగానీ, చర్మం మంటగానీ ఉంటే.. వాటి నుంచి ఉపశమనం కలిగించడంలో పుదీనా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. మీరు పుదీనాతో చేసిన నూనెను ప్రిక్లీ హీట్ ప్రాంతంలో అప్లై చేస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

6 / 6
వీటి ద్వారా వేడి, మంట, దురద నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.