Raw Milk: ఖరీదైన క్రీములు కాదు.. పచ్చి పాలను రోజూ ఇలా ముఖానికి రాసుకోండి.. మెరిసిపోతారు..!

|

Jul 25, 2024 | 10:59 AM

ముఖం కాంతివంతంగా, యవ్వనంగా ఉండాలని అందరూ కోరకుంటారు. ఇక అమ్మాయిలైతే ఈ విషయంలో మరింత ఎక్కువ శ్రద్ధ, ఆసక్తి చూపుతుంటారు. అందుకోసం ఖరీదైన ఫేస్ క్రీములు కూడా ట్రై చేస్తుంటారు. కానీ, వీటి నుండి ఆశించిన ఫలితం అంతగా ఉండదు. ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలన్నా, అందంగా కనిపించాలన్నా ఫేస్ క్రీముల కంటే ఇంటి చిట్కాలు ఎంతగానో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అందులో బాగంగా పచ్చి పాలను రోజూ ముఖానికి రాసుకుంటే అద్బుత ఫలితాలు ఉంటాయి. అసలు పచ్చిపాలు ముఖానికి చేసే మేలు ఏంటి? వాటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
పచ్చిపాలను రోజూ ముఖానికి రాసుకుంటూ ఉంటే చర్మం మీద మృత కణాలు తొలగిపోతాయి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. చర్మం అందంగా, యవ్వనంగా మారడంతో పాటు ముఖం మీద మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగిపోతాయి.

2 / 6
ముఖంలో గ్లో పెరుగుతుంది. పచ్చిపాలు ముఖ చర్మలో ట్యానింగ్ ను తొలగించి సహజమైన మెరుపును ఇస్తుంది. ఇది చర్మానికి తేమను, పోషణను అందిస్తుంది. దీని వల్ల ముఖం మృదువుగా మారుతుంది. దీని వల్ల మచ్చలేని చందమామ లాంటి చర్మం మా సొంతమవుతుంది.

3 / 6
ఇందుకోసం ఒక గిన్నెలో పచ్చిపాలు తీసుకోవాలి. దీనిలో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని వృత్తాకారంలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది డెడ్ స్కిన్ ను శుభ్రపరుస్తుంది. మృతకణాలు తొలగించి చర్మానికి పునరుజ్జీవనాన్ని ఇస్తుంది. ముఖం కాంతివంతంగా మారుస్తుంది.

4 / 6
మరో విధానంలో ఒక చిన్న కప్ లో పచ్చిపాలు తీసుకోవాలి. ఇందులో స్వచ్చమైన కుంకుమ పువ్వు రెమ్మలు వేయాలి. దీన్ని కొద్దిసేపు అలాగే ఉంచాలి. కొంత సమయం తరువాత కాటన్ బాల్ ను ఈ పాలలో ముంచి పాలను ముఖానికి పట్టించి కొద్దిసేపు అలాగే వదిలేయాలి.

5 / 6
సుమారు 15 నిమిషాల తరువాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పచ్చిపాలు, కుంకుమ పువ్వు రెండూ చర్మానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

6 / 6
సున్నితమైన చర్మం, పొడి చర్మం ఉన్నవారిలో మృదువుగా మారాలి అంటే పచ్చిపాలు, తేనె బెస్ట్‌ టిప్‌గా పనిచేస్తుంది. ఈ రెండింటిని బాగా మిక్స్‌ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మం మృదువుగా మారుతుంది. ఇందులోనే కాసింత పసుపు కలిపి ముఖానికి అప్లై చేస్తే ముఖం మీద మచ్చలు చాలా తొందరగా మాయం అవుతాయి. పిగ్మెంటేషన్ కూడా తొలగిపోతుంది.