పూజలు చేసి మరీ రహస్య తవ్వకాలు.. వినాయకుడి బండరాయి వద్ద ఏం జరిగింది?

Edited By:

Updated on: Jul 24, 2026 | 12:22 PM

గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఓ భారీ బండరాయిపై వినాయకుడి రూపం చెక్కబడి ఉంది. అదే బండరాయి పక్కనే లోతుగా తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. తవ్వకాల కోసం పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించారు. దీనికి తోడు ఘటన స్థలంలో తాయత్తులు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయతో పాటు ఇతర పూజా సామాగ్రి సైతం కనిపించడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.

1 / 5
నాగర్ కర్నూల్ జిల్లాలో మరోసారి గుప్తనిధుల వేట కలకలం రేపింది. ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలోని పురాతన లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు రహస్యంగా తవ్వకాలు చేపట్టారు. తెల్లవారుజామున గ్రామస్థులు గమనించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

2 / 5

గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఓ భారీ బండరాయిపై వినాయకుడి రూపం చెక్కబడి ఉంది. అదే బండరాయి పక్కనే లోతుగా తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. తవ్వకాల కోసం పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించారు. దీనికి తోడు ఘటన స్థలంలో తాయత్తులు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయతో పాటు ఇతర పూజా సామాగ్రి సైతం కనిపించడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.

గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఓ భారీ బండరాయిపై వినాయకుడి రూపం చెక్కబడి ఉంది. అదే బండరాయి పక్కనే లోతుగా తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. తవ్వకాల కోసం పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించారు. దీనికి తోడు ఘటన స్థలంలో తాయత్తులు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయతో పాటు ఇతర పూజా సామాగ్రి సైతం కనిపించడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.

3 / 5

 గుప్తనిధులు దక్కుతాయనే మూఢనమ్మకాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు భావిస్తున్నారు. 
అయితే ఇదే ప్రాంతంలో గతంలో సైతం అనుమానాస్పద తవ్వకాలు జరిగినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. నాడు పూర్తిస్థాయిలో విచారణ జరగలేదని, అందుకే మళ్లీ ఇలాంటి తవ్వకాలకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గుప్తనిధులు దక్కుతాయనే మూఢనమ్మకాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు భావిస్తున్నారు. అయితే ఇదే ప్రాంతంలో గతంలో సైతం అనుమానాస్పద తవ్వకాలు జరిగినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. నాడు పూర్తిస్థాయిలో విచారణ జరగలేదని, అందుకే మళ్లీ ఇలాంటి తవ్వకాలకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

4 / 5
పురాతన దేవాలయాలు, కొండలు, బండరాళ్ల వద్ద గుప్త నిధుల పేరుతో జరుగుతున్న అక్రమ తవ్వకాలు ఆధ్యాత్మిక విశ్వాసాలను దెబ్బతీయడమే కాకుండా చారిత్రక సంపదకు ప్రమాదంగా మారుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

5 / 5
తాజా ఘటనపై అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని మామిళ్లపల్లి గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. తవ్వకాలకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో పాటుగా పురాతన ఆలయాల వద్ద రాత్రిళ్లు నిఘా పెంచాలని సూచిస్తున్నారు.

Follow Us