Monsoon Travel: మీరు ప్రకృతి ప్రేమికులా..? అయితే ఈ ప్రదేశాలను చూస్తే అస్సలు వదిలిపెట్టరు..

|

Jul 24, 2022 | 9:46 PM

Monsoon Travel: సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన రాజస్థాన్ పర్యాటక ఆతిథ్యానికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. పర్యాటకులు ఇక్కడి టూరిస్ట్ స్పాట్లను వీక్షించేందుకు చాలాసంస్థలు క్యాటరింగ్ ట్రిప్‌తో ఆకట్టుకుంటాయి.

1 / 5
Monsoon Travel: సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన రాజస్థాన్ పర్యాటక ఆతిథ్యానికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. పర్యాటకులు ఇక్కడి టూరిస్ట్ స్పాట్లను వీక్షించేందుకు చాలాసంస్థలు క్యాటరింగ్ ట్రిప్‌తో ఆకట్టుకుంటాయి. చాలామంది ఇక్కడి ప్రదేశాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. వర్షాకాలంలో ఇక్కడికి వెళ్తున్నట్లయితే.. తప్పకుండా ఈ ప్రదేశాలను సందర్శించండి.

2 / 5
మౌంట్ అబూ: దీనిని రాజస్థాన్ హిల్ స్టేషన్ అని పిలుస్తారు.. ఇది హనీమూన్ స్పాట్‌గా పేర్కొంటారు. వర్షాకాలంలో రాజస్థాన్‌కు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే మౌంట్ అబూకు తప్పకుండా వెళ్లాలి. ఎందుకంటే ఈ పర్యాటక ప్రదేశం వర్షంలో మరింత అందంగా కనిపిస్తుంది.

3 / 5
సజ్జన్‌గఢ్ ప్యాలెస్: ఇది కూడా రాజస్థాన్‌లోని ఒక ప్రదేశం. ఇక్కడ అనేక సరస్సులు ఉన్నాయి. సరస్సులో బోటింగ్ చేయడం ద్వారా యాత్రానందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. సజ్జన్‌గఢ్ ప్యాలెస్ నుంచి సూర్యాస్తమయం దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది.

4 / 5
అచల్‌ఘర్ హిల్: దీనిని కూడా రాజస్థాన్‌లో హిల్ స్టేషన్‌గా పేర్కొంటారు. ఈ పర్వతం మౌంట్ అబూ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని చుట్టూ ఉన్న పచ్చదనం ప్రకృతి ప్రేమికుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. కుటుంబ సమేతంగా వెళ్తేనే ఎంజాయ్ చేయవచ్చు.

5 / 5
గురు శిఖర్: రాజస్థాన్‌లోని ప్రశాంతమైన ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటే.. మీరు గురు శిఖరానికి వెళ్లవచ్చు. పచ్చదనంతో పరుచుకున్న ఈ ప్రదేశంలో మీరు ట్రెక్కింగ్ చేయవచ్చు. ఇక్కడ ఉన్న దత్తాత్రేయ దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది.