
పాతకాలం నాటి వంటల్లో గోగుపూల గుడ్ల పులుసు. దీని వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి అరుదైన కూర గోగుపూల గుడ్ల పులుసు కూడా ఒకటి. అయితే, అందరికీ గోగు ఆకులు మాత్రమే తెలుసు. కానీ, ఈ పూలతో కూడా రుచికరమైన కూర కూడా చేసుకోవచ్చని కొందరికి తెలీదు. ఒక్క సారి తింటే ఇక వదలరు.

గోగుపూలలో పులుపు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా మంచిది. ఇది తిన్న తరవాత ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. సమ్మర్లో ఈ కర్రీ తింటే శరీరంలో వేడి తగ్గి ఆకలిని పెంచుతుంది. ఇంకా వీటిలో గుడ్లను కూడా వేయడం వలన కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుంది. అందు వలన దీనిని పోషకాహారంగా చెబుతారు.

గోగుపూల గుడ్ల పులుసు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోగుపూలు, 4 గుడ్లు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, 7 వెల్లుల్లి రెబ్బలు , ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర కప్పు నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా గోగుపూలను తీసుకుని బాగా కడిగి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇంకా పాన్‌లో ఆయిల్ వేసి అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా వెల్లుల్లిని కూడా వేయించి దానిలో కట్ చేసిన ఉల్లిపాయలను వేసి గోల్డ్ కలర్లోకి మారే వరకు వీటిని బాగా వేయించాలి. ఆ తర్వాత రెండు టమాటాలు, పచ్చిమిర్చిని బాగా ఉడికించాలి

మధ్యలో గోగుపూలను వేసి 5 నిముషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తరువాత కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు వేసి పులుసును బాగా మరిగించాలి. చివర్లో కోడి గుడ్లు వేసి బాగా ఉడికించాలి. ఇలా పొయ్యి మీద 15 నిముషాల ఉంచి కూరను దించేయాలి. అంతే, వేడి వేడి గోగుపూల గుడ్ల పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో అయితే, లొట్టలు వేసుకుంటూ తింటారు.