
వర్షాకాలం మొదలైంది గత మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాన పడుతూనే ఉంది ఈ సమయంలో కొందరికి శరీర నొప్పులు, అలసట, నీరసం, జలుబు సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి టైం లోనే మన తాతలు తాగిన బాదం-మిరియాల పాల డ్రింక్ తాగితే శరీరానికి వేడి, శక్తి అందుతుంది దీనితో వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు.

బాదం, మిరియాల మిల్క్ కు కావలసిన పదార్థాలు: 10 బాదంపప్పులు, నాలుగు నుంచి 10 మిరియాలు, రెండు గ్లాసులు పాలు, ఇంకా కొద్దిగా బెల్లం పొడి , రెండు టేబుల్ స్పూన్స్ తేనే, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , ఇంకా కొద్దిగా కుంకుమపువ్వును తీసుకోవాలి. వీటిని సరైన కొలతలతో చేస్తే రుచి అదిరిపోతోంది.

బాదం, మిరియాల మిల్క్ కు తయారీ విధానం: ముందుగా బాదంపప్పును తీసుకుని వాటిని కనీసం 5 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తరవాత బాదం తొక్కలు తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు మిరియాలను తీసుకుని వాటిని పొడిలాగా చేసి పెట్టుకోవాలి. వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే, ఇంకా దీనిని ఒక పాత్రలో పాలు పోసి బాగా మరిగించాలి.

ఇక ఇప్పుడు ఈ పాలు మరిగిన తర్వాత బాదం-మిరియాల పేస్ట్ కూడా బాగా కలుపుకోవాలి. ఇంకా వీటిని తక్కువ మంటపై కనీసం 10 నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించాలి. అలాగే, ఇప్పుడు దీనిలో కొద్దిగా బెల్లం పొడి, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి ఇంకో 5 నిమిషాల పాటు మరిగించాలి. అంతే, వేడివేడిగా గ్లాసులో పోసి తాగాలి.

బాదం-మిరియాల డ్రింక్ వలన కలిగే లాభాలు ఇవే: ఈ డ్రింక్ వర్షాకాలంలో శరీరానికి వేడిగా ఉంచుతుంది. ఇంకా అలసట, నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా శక్తిని పెంచే పోషకాలు కూడా ఇది అందిస్తుంది. జలుబు, గొంతు సమస్యలతో బాధ పడేవాళ్ళు ఈ సమయంలో తాగితే మంచిగా అనిపిస్తుంది. రాత్రిపూట తాగితే ఇంకా చాలా మంచిది