
CIA: అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థల జాబితాలో మొదటి పేరు CIA. CIA పూర్తి రూపం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఈ నిఘా సంస్థ అమెరికా కోసం పనిచేస్తుంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా CIAని స్థాపించింది.

మొస్సాద్: ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సంస్థలలో ఒకటి. 1949లో స్థాపించిన మొస్సాద్ ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ శత్రువులను వేటాడి చంపుతుంది. ఇప్పటికి అనేక మిషన్ చేసి సక్సెస్ అయింది.

RAW: ఇందులో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది భారత నిఘా సంస్థ RAW పేరు కూడా ఉంది. 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత 1968లో భారతదేశంలో RAW ప్రారంభమైంది. దీని పూర్తి రూపం రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్. ఈ నిఘా సంస్థ అనేక విజయవంతమైన మిషన్స్ చేసింది.

MI6 (SIS): MI6 అనేది బ్రిటన్ నిఘా సంస్థ, దీనిని సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (SIS) అని కూడా పిలుస్తారు. దీనిని సాధారణంగా MI-6 అని పిలుస్తారు. 1909లో సీక్రెట్ సర్వీస్ బ్యూరో విదేశీ విభాగంగా ఏర్పడి మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బాగా అభివృద్ధి చెందింది 1920 ప్రాంతంలో అధికారికంగా దాని ప్రస్తుత పేరును స్వీకరించింది.

ISI: పొరుగు దేశమైన పాకిస్తాన్ నిఘా సంస్థ ISI కూడా ఉంది. ఇది స్వాతంత్ర్యానికి ముందు 1948లో ప్రారంభమైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంలో ప్రసిద్ధి చెందింది. ఇది సమస్త ఉగ్రవాదానికి భారతదేశంతో పాటు అమెరికా లాంటి ఎన్నో దేశాల్లో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు.