
తమిళనాడులోని పెరుంగళత్తూరు స్టేషన్ దేశంలోని అత్యంత మురికి రైల్వే స్టేషన్లలో మొదటి స్థానంలో ఉంది. పరిశుభ్రతలో పూర్తిగా వెనుకబడిన ఈ స్టేషన్ రైల్ స్వచ్ఛ్ పోర్టల్ ప్రకారం అగ్రస్థానాన్ని సంపాదించింది.

తమిళనాడులోని గిండి రైల్వే స్టేషన్ అపరిశుభ్రతలో రెండో స్థానాన్ని దక్కించుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న సదర్ బజార్ రైల్వే స్టేషన్ మూడవ స్థానంలో నిలిచింది. చెత్త పడేయడం, డ్రైనేజీ సమస్యల కారణంగా మురికి రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

తమిళనాడులోని వేలచ్చేరి స్టేషన్ టాప్ 10 అపరిశుభ్ర స్టేషన్లలో నాలుగవ స్థానంలో ఉంది.

తమిళనాడులోనే గుడువాంచెరి స్టేషన్ ఐదవ స్థానంలో ఉండటం దురదృష్టకరం.

తమిళనాడుకు చెందిన సింగపెరుమాల్కోయిల్ స్టేషన్ మురికి స్టేషన్లలో 6వ స్థానాన్ని సంపాదించింది.

కేరళలోని ఒట్టపాలెం స్టేషన్ కూడా ఈ లిస్టులో 7వ స్థానంలో ఉంది.

తమిళనాడులోని పజవంతంగల్ రైల్వే స్టేషన్ 8వ స్థానంలో ఉంది.

బీహార్‌లోని అరారియా కోర్ట్ రైల్వే స్టేషన్ మురికి రైల్వే స్టేషన్లలో 9వ స్థానంలో నిలిచింది.

ఉత్తర ప్రదేశ్‌లోని ఖుర్జా స్టేషన్ ఈ లిస్టులో 10వ స్థానంలో ఉంది.