
తిప్పతీగను చాలా మంది చిన్న చూపు చూస్తారు. కానీ, ఇది వంద రోగాలను కూడా నయం చేయగలదు. దీనికి అంత శక్తీ ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. మనకి వచ్చే డెంగ్యూ జ్వరానికి కూడా ఇది చెక్ పెట్టగలదు.

జ్వరం వచ్చినప్పుడు ఎవరైనా నీరసం అవుతారు ఇక డెంగ్యూ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సమయంలో ఇమ్యూనిటీ పవర్ అవసరం అప్పుడు తిప్పతీగ పని చేసుంది. దీనిని తీసుకుంటే డెంగ్యూ జ్వరం నుంచి ఉపశమనం పొందుతారు.

ఇవి మనకి ఆకులు, పౌడర్ రూపంలో దొరుకుతాయి. ఆహారం జీర్ణం కానీ వారికీ ఇది అద్భుతంగా పని చేస్తుంది. కాబట్టి, వీటిని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి. జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

తిప్పతీగను తీసుకుంటే పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది. చాలా మంది చిన్న దానికే టెన్షన్ పడుతుంటారు అలాంటి వారికీ ఇది బెస్ట్ మెడిసిన్ అని చెప్పాలి.

ఇంకా కీళ్ళ నొప్పులు ఉన్న వారు కూడా తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)