
ప్రపంచ వ్యాప్తంగా 15 శాతం మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. థైరాయిడ్ హార్మోన్ అసమతుల్యత రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్య నివారణకు మందులతో పాటు ఈ కింది పానియాలు కూడా సేవిస్తే సమస్య ఉంచి ఉపశమనం పొందవచ్చు.

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. అంతేకాకుండా పసుపులో ఉండే కర్కుమిన్ సమ్మేళనం పాల పోషక విలువలను పెంచుతుంది. థైరాయిడ్ సమస్యలకు ఈ పానీయం చక్కగా ఉపయోగపడుతుంది.

గ్లాసు నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగాలి. ఆల్కలీన్ స్వభావం కలిగిన డ్రింక్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ స్రావాన్ని కూడా నియంత్రిస్తుంది.

రోజువారీ ఆహారంలో మజ్జిగ చేర్చుకోవాలి. మజ్జిగ గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హైపోథైరాయిడిజంలో మంటను తగ్గిస్తుంది. దీనిలోని ప్రోబయోటిక్స్ థైరాయిడ్ సమస్యతో బాధపడేవారికి సమస్య నివారణలో చక్కగా ఉపయోగపడుతుంది.

బాదం పాలు శరీరంలో మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పాలు లేదా పాల ఉత్పత్తుల వల్ల అలెర్జీ ఉన్నవారు బాదం పాలు తాగవచ్చు. అలాగే టీ, కాఫీలో బాదం పాలను తాగవచ్చు.