ఈ ఖరీదైన పుచ్చకాయ హొక్కైడో ద్వీపంలోని యుబారిలో పండిస్తారు. దీని ధర అనేక వేల డాలర్లు. ఈ పండు ముఖ్యంగా తీపి రుచి, తక్కువ గింజలు, ఘాటైన సువాసనతో నిండివుంటుంది. యుబారి కింగ్ పుచ్చకాయలు గుండ్రంగా, నునుపైన చర్మంతో ఉంటాయి. లోపల గుజ్జు నారింజ రంగులో ఉండి చాలా తీపిగా ఉంటుంది. దీని వాసన కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఈ పండును చుగెన్ సందర్భంగా బహుమతిగా ఇస్తారు.ఈ పుచ్చకాయ ప్రత్యేకత ఏమిటంటే దీనిని చాలా జాగ్రత్తగా పెంచుతారు. ప్రతిరోజు ఈ పండును శుభ్రం చేస్తారు.ఈ పుచ్చకాయలు 1.5 నుండి 2 కిలోల బరువు వరకు ఉంటాయి.
యుబారి కింగ్ పుచ్చకాయను కంటాలౌప్, బర్పీస్ స్పైసీ కంటాలౌప్ అనే రెండు రకాల పుచ్చకాయల మిశ్రమం ద్వారా తయారు చేస్తారు. ఈ యుబారి పుచ్చకాయలు జూన్ నుండి ఆగష్టు మొదటి వారం వరకు మాత్రమే దొరుకుతాయి.
2018 సంవత్సరంలో రెండు యుబారి కింగ్ పుచ్చకాయలు 3.2 మిలియన్ జపనీస్ యెన్లకు అమ్ముడయ్యాయి. 2019లో ఒక జత యుబారి కింగ్ మెలోన్ 46,500 డాలర్లకు (సుమారు 35 లక్షల రూపాయలు) అమ్ముడయ్యింది.
ఈ పండు ప్రత్యేకత విషయానికి వస్తే..ఈ పండు చాలారకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, భాస్వరం, కాల్షియం వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండు ధర కారణంగా, సామాన్యులు దీనిని తినాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే అంటారు. ప్రపంచవ్యాప్తంగా దీనిని కొనుగోలు చేసే వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు.