హైదరాబాదీ స్పెషల్.. గుమ గుమలాడే మటన్ హలీమ్ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తే అదిరిపోద్దీ!

Updated on: Feb 27, 2026 | 11:07 AM

హైదరాబాదీ హలీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ఇక రంజాన్ వచ్చిందంటే చాలు హలీమ్ గుమ గుమలు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. చాలా మంది చార్మినార్ వెళ్లి హలీమ్ తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. అయితే బయట తినడం కంటే ఇంటిలో చాలా టేస్టీగా హాలీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం పదండి.

1 / 5
కావాల్సిన పదార్థాలు : గోధుమ రవ్వ ఒక కప్పు, బార్లీ గింజలు, మినప పప్పు, శనగ పప్పు, పెసర పప్పు, ఎర్ర కంది పప్పు, మూన్ లెస్ మటన్ 500 గ్రాములు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, మిరియాలు, గులాబీ రేకులు , ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పచ్చిమిర్చి,  పుదీనా ఆకులు, స్వచ్ఛమైన నెయ్యి, నూనె, ఉప్పు, నిమ్మకాయలు, జీడిపప్పు, బాదం.

2 / 5
తయారీ విధానం : ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం ఒక బౌల్ తీసుకొని, అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా , కబాబ్ చిని, మిరియాలు, గులాబీ రేకులు అన్నింటినీ వేసి మెత్తటి పౌడర్‌లా చేసుకోవాలి.

3 / 5
తర్వాత పప్పులు నానబెట్టుకోవాలి. దీని కోసం ఒక బౌల్ తీసుకొని అందులో అన్ని రకాల పప్పులతో పాటు, గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం వేసి ఐదు నుంచి ఆరుగంటల పాటు నానబెట్టుకవాలి.  తర్వాత స్టవ్ ఆన్ చేసి, ఒక బౌల్ పెట్టి, అందులో నూనె పోసి, పచ్చి మిర్చీ, ఆనియన్స్, అల్లం వెల్లు్ల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర, మటన్ ముక్కలు వేసి కనీసం 15 నిమిషాల పాటు తక్కువ మంటపై వేయిచుకోవాలి.

4 / 5
తర్వాత అందులో పెరుగు, నెయ్యి, ఉప్పు , కారం , వేసి కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ, బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ముక్క ముట్టుకుంటే, విరిగిపోయే విధంగా మటన్ ఉడకాలి. అప్పుడే హాలీమ్ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందంట. దీని తర్వాత నానబెట్టిన పప్పులు, బియ్యం, రవ్వ, ఒక బౌల్ లో వేసి వీటిని కనీసం ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నాన బెట్టడం వలన ఇది చాలా త్వరగా ఉడికిపోతుంది, ఇవి చల్లారిన తర్వాత దీనిని మిక్సీ పట్టి, పక్కన పెట్టుకోవాలి.

5 / 5
ఇప్పుడు ఉడికిన మటన్ మిశ్రమం తీసుకొని, అందులో మటన్‌లో నుంచి బోన్ వేరు చేసి, ఈ మిశ్రమంలో మిక్సీ పట్టిన పప్పుల మిశ్రమం వేసుకొని, గ్యాస్ పై మంచిగా మ్యాష్ చేస్తూ ఉండాలి. నెయ్యి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పూదీన వంటివి వేస్తూ మంచిగా మ్యాష్ చేస్తూ ఉండాలి. అచ్చం హలీమ్ మాదిరి వచ్చిన తర్వాత , వీటిపై బాదం, పిస్తా, కొత్తిమీర వేసుకొని, వేడి వేడిగా తింటే టేస్ట్ అదిరిపోతుంది.

Follow Us