అమృతం కూడా పనికిరాదు.. ఆరోగ్యాన్నిచ్చే రాగి గంజి ఇలా ప్రిపేర్ చేయండి!

Updated on: Feb 12, 2026 | 9:52 AM

రాగులు ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటిని తీసుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయి. అందుకే చాలా మంది ఇప్పటికీ వీటిని వివిధ రకాలుగా తీసుకుంటారు. కొంత మంది ఇడ్లీ, దోశ, జ్యూసీగా తీసుకుంటారు. అయితే దీంతో గంజి ప్రిపేర్ చేసి తాగడం వలన కూడా కళ్లు చెదిరే బెన్ ఫిట్స్ ఉన్నాయంట. కాగా, దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది వేడి నుంచి ఉపశమనం పొందడానికి , తక్షణ శక్తి కోసం వివిధ రకాల డ్రింక్స్ తాగుతుంటారు. కానీ వీటన్నింటికంటే, తక్కువ ధరలో రాగి గంజి చేసుకొని తాగడం చాలా మంచిది. కాగా, దీని తయారీ విధానం చూద్దాం.

2 / 5
రాగి గంజి తయారీకి కావాల్సిన పదార్థాలు : రాగి పిండి కప్పు, పెరుగు ఒక కప్పు, రుచికి సరిపడ ఉప్పు, ఆనియన్స్ తరిగినవి, కొంచెం కొత్తిమీర, రెండు పచ్చిమిర్చీలు చిన్నగా తరగాలి.

3 / 5
తయారీ విధానం : రాగి గంజి తయారీకి ముందు రోజు రాత్రి రాగి పిండిని నానబెట్టాలి. తర్వాత ఉదయం నానబెట్టిన పిండితో రాగి గంజి తయారు చేయాలి. దీని కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి , అందులో రెండు గ్లాస్‌ల నీరు పోసి, చిటికెడు సాల్ట్ వేసి మరగబెట్టాలి.

4 / 5
నీరు మరిగే సమయంలో అందులో నానబెట్టుకున్న రాగి పిండి వేయాలి. తర్వాత దానిని మంచిగా కలుపుతూ, అందులో పెరుగు వేయండి. కలిపే క్రమంలో కొన్ని నీళ్లు పోస్తూ మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. 5 నిమిషాలు గ్యాస్ పై దీనిని ఉడకనిచ్చి , తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి.

5 / 5
దీని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రాగి మిశ్రమంలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి, కొత్తిమీర వేసి, మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మట్టి కుండలో 30 నిమిషాలు ఉంచి, తర్వాత తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. అంతే కాకుండా దీనిని మట్టికుండలో వేయకుండా కూడా తీసుకోవచ్చును. కానీ చల్లదనం కోరుకునే వారు మట్టికుండలో వేసి తీసుకుంటుంటారు.