Theybies: ‘డెబీస్’ సంస్కృతికి ప్రపంచమంతటా ఆదరణ.. కూతురైనా, కొడుకైనా ఒకటే అంటున్న జనం..

|

Apr 09, 2023 | 4:26 PM

నేమింగ్ యువర్ లిటిల్ గ్రీక్ అనే పుస్తక రచయిత స్కాట్ రూబిన్ మాట్లాడుతూ.. కూతురు, కొడుకు అనే తేడా లేదంటూ ఓ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా ఓ ప్రచారంలా సాగుతోంది. ఈ సంస్కృతిలో పిల్లల మధ్య తేడా లేదు.. ధరించే దుస్తులపై ఎటువంటి పరిమితి విధించబడదు.

1 / 5
ప్రపంచవ్యాప్తంగా స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాన్ని తొలగించి సమానత్వం కోసం పనిచేసే స్థలం నుండి ప్రభుత్వం అమలు చేసే చట్టం వరకు మార్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సమానత్వం పెద్దలకే పరిమితం కాలేదు.. పిల్లల విషయంలో కూడా ఈ అంతరాన్ని  తగ్గించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని రూపుమాపడానికి థెబీస్ అనే సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ భావన ఏమిటో.. దీని ప్రయోజనాలు.. కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకోండి.

2 / 5
డెబిజ్ అంటే అబ్బాయి లేదా అమ్మాయి కాదు. ఈ సంస్కృతిని అవలంబిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తటస్థ లింగాన్ని ఉపయోగిస్తున్నారు. ఒక ఇంట్లో అబ్బాయి పుట్టాడు అనుకుందాం.. అబ్బాయి అనే పదాన్ని ఉపయోగించకుండా..తాము తల్లిదండ్రులం అయ్యామంటూ ప్రపంచానికి శుభవార్త చెప్పడానికి డెబిజ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. డెబిజ్ రెండు పదాల కలయిక. డి అంటే వారు.. బేబీ అంటే శిశువు.. ఈ రెండు పదాల నుంచి ఏర్పడిందే.. డెబిజ్.. ఈ విధంగా తటస్థ లింగానికి పదం ఉపయోగించబడుతోంది.

3 / 5

నేమింగ్ యువర్ లిటిల్ గ్రీక్ అనే పుస్తక రచయిత స్కాట్ రూబిన్ మాట్లాడుతూ.. కూతురు, కొడుకు అనే తేడా లేదంటూ ఓ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా ఓ ప్రచారంలా సాగుతోంది. ఈ సంస్కృతిలో పిల్లల మధ్య తేడా లేదు.. ధరించే దుస్తులపై ఎటువంటి పరిమితి విధించబడదు. ఈ సంస్కృతిని అనుసరించే తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చేయాలో వారు బలవంతం చేయరు. అబ్బాయిలు, అమ్మాయిలు ఆడుకునే బొమ్మల నుంచి , ధరించే దుస్తులనుంచి ఏ విధమైన రెస్టిక్షన్స్‌ను పెట్టరు.

4 / 5
అసలు డెబిజ్ సంస్కృతి ఎందుకు అవలంబించబడుతోంది.. దానిని అర్థం ఏమిటో తెలుసుకుందాం.. NBC న్యూస్ నివేదికలో, వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన జూలియా.. పిల్లలలో లింగ వివక్ష తనను బాధపెడుతుందని చెప్పింది. తాను పురుషుల ఆధిపత్య ఇంజనీరింగ్ విభాగంలో పనిచేశానని.. అప్పుడు లింగం వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నానని పేర్కొంది. అంతేకాదు మహిళల నైపుణ్యాన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేస్తారని ఒక పరిశోధనలో కూడా రుజువైంది.

5 / 5
అయితే ఈ డెబిజ్ సంస్కృతిపై మరోవైపు తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు తల్లిదండ్రులు డెబిస్ భావనను విమర్శిస్తున్నారు. ప్రపంచాన్ని పురుషులు, స్త్రీలు అని రెండు భాగాలుగా విభజించారు. అటువంటి పరిస్థితిలో తటస్థ లింగానికి చెందిన పిల్లలు తమను తాము ఏ వర్గంలో భాగంగా భావిస్తారనేది భవిష్యత్ లో ప్రశ్నార్ధకంగా మారుతుందని అది వారికి సవాలుగా మారుతుందని లింగ సమస్యలపై పనిచేసే బ్రిటిష్ సైకోథెరపిస్ట్ మార్క్ వాహ్‌మేయర్ హెచ్చరించారు. ఈ భావన కారణంగా పిల్లలు పాఠశాలలు, సమాజంలో వేధింపులకు గురవుతారని చెప్పారు. ఒకొక్కసారి మనోభావాలను దెబ్బతీయవచ్చని పేర్కొన్నారు. 