Chinni Enni |
Nov 19, 2024 | 6:22 PM
అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. అందుకు మీరు ఏం చేస్తున్నారన్నది కూడా చాలా ముఖ్యం. కేవలం క్రీమ్స్, పౌడర్స్ వేసుకుంటే అందంగా కనిపించరు. చర్మ ఆరోగ్యం లోపలి నుంచి ఉండాలి. మీరు తీసుకునే ఆహారం సరైనదిగా ఉంటే.. మీరు ఎప్పుడూ అందమైన చర్మాన్ని పొందుతారు..
మనల్ని అందంగా కనిపించేలా చేసేవి మన చుట్టూ చాలానే ఉన్నాయి. కొన్ని రకాల కూరగాయలు తినడం వల్ల మన చర్మం ఎంతో అందంగా మారుతుంది. చర్మానికి కూడా మంచి పోషణ అందుతుంది.
కూరగాయల్లో మనకు అనేక ఔషధ గుణాలు ఉన్న మంచి పోషకాలు లభిస్తాయి. మనకు లభించే కూరగాయలన్నీ ఎంతో ఆరోగ్యకరమైనవి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. చర్మాన్ని కూడా అందంగా మార్చుతుంది.
అదే విధంగా ఆకు కూరలు కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాలే, క్యాబేజీ. బచ్చలి కూర వంటివి మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే చర్మాన్ని అందంగా మార్చుతాయి.
టమాటా, క్యారెట్ వంటివి ప్రతీ రోజూ తీసుకున్నా చర్మానికి రక్షణగా నిలుస్తాయి. వీటిల్లో విటమిన్ సి, కె, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై గీతలు, ముడతలు రాకుండా స్కిన్‌ని మెత్తగా, సాఫ్ట్‌గా ఉంచుతాయి.