
సాధారణంగా ఒక్కోసారి చెమట ఎక్కువగా పెడుతూ ఉంటుంది. చెమట పట్టిన తర్వాత విపరీతంగా దురద పెడతూ ఉంటుంది. దురద పెట్టిన తర్వాత గోకాలనిపిస్తూ ఉంటుంది. అలా గోకడం వల్ల చర్మ ఎర్రగా మారి.. మరింత మంటగా పెడుతుంది. దద్దర్లు వచ్చేసి.. చర్మం పాడైపోతుంది.

చెమట తర్వాత వచ్చే దురదను తగ్గించుకోవడానికి అనే చిట్కాలు ఉన్నాయి. ముల్తానీ మట్టి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దురద పెట్టిన చోట ముల్తానీ మట్టి రాస్తే.. దురద అనేది తగ్గుతుంది.

చెమట వాసన పట్టి, దురద కూడా తగ్గాలంటే.. గంధం పొడి రాసినా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. గంధం పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి రాసుకుంటే దురద తగ్గడంతో పాటు దుర్వాసన కూడా తగ్గుతుంది.

బంగాళదుంప రాయడం వల్ల చర్మంపై ఇరిటేషన్ తగ్గడంతో పాటు మంట కూడా తగ్గిపోతుంది. దురద నుంచి త్వరగా సులువగా ఉపశమనం పొందవచ్చు. బంగాళదుంపను పేస్ట్ చేసి.. చర్మంపై రాయడం వల్ల దురద తగ్గుతుంది.

దురద ఎక్కువగా ఉండటం వల్ల గోకుతూ ఉంటారు. అలా విపరీతంగా గోకడం వల్ల ఛారలు కూడా ఏర్పడతాయి. కార్న్ స్టార్చ్ రాసుకోవడం దురద తగ్గుతుంది. ఇలా ఇంట్లో ఉండే వాటితో కూడా దురదను ఈజీగా తగ్గించుకోవచ్చు.