అమ్మాయిల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో బ్లాక్ హెడ్స్ కూడా ఒకటి. చాలా లేడీస్‌ని ఇవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా.. ఇవి అంత తేలిగ్గా పోవు. ఈ బ్లాక్ హెడ్స్‌ని తొలగించుకునేందుకు మార్కెంట్లో లభించే ఎన్నో చిట్కాలు వాడుతూ ఉంటారు.
కేవలం స్క్రబ్ చేస్తేనే పోతాయి. ఈ బ్లాక్ హెడ్స్ తొలగించుకునేందుకు ఎప్పుడూ బయట వాటినే కాకుండా.. ఇంట్లో సహజంగా లభించే వాటితో కూడా వీటిని వదిలించుకోవచ్చు. దీంతో డబ్బు కూడా ఆదా అవుతుంది.
బంగాళ దుంప రసం, శనగ పిండి, అలోవెరా జల్ ఈ మూడింటిని తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట రాసి ఓ నిమిషం పాటు స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత ఐదు నిమిషాలు ఉంచి కడిగేస్తే ఈజీగా బ్లాక్ హెడ్స్ పోతాయి.
జామ ఆకులతో కూడా బ్లాక్ హెడ్స్ తొలగించుకోవచ్చు. జామ ఆకులను పేస్టులా చేసి.. అందులో కలబంద గుజ్జు, కొద్దిగా పసుపు కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముక్కుపై రాసి మసాజ్ చేస్తే త్వరగా బ్లాక్ హెడ్స్ పోతాయి.
ముల్తాని మట్టితో చర్మ అందాన్ని పెంచుకోవచ్చు. అలాతే బ్లాక్ హెడ్స్ కూడా తొలగించుకోవచ్చు. ముల్తానీ మట్టిలో కొద్దిగా పెరుగు, రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖం అంతా పట్టించండి. పది నిమిషాలు ఆగాక ముఖాన్ని శుభ్రం చేస్తే.. బ్లాక్ హెడ్స్ పోవడమే కాకుండా ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )