Winter Lip Care Tips: నల్లగా మారిన పెదాలను ఎర్రగా మార్చే చిట్కాలు.. రోజూ ఇలా చేయండి

Updated on: Jan 28, 2024 | 11:29 AM

చలికాలంలో పెదవులు పగిలిపోవడం సర్వసాధారణం. అయితే పెదవుల సంరక్షణ గురించి చాలా మందికి సరైన అవగాహన ఉండదు. పగిలిన పెదాలను లిప్ బామ్‌తో మాత్రమే చికిత్స చేయలేం. ఎండిపోయిన పెదవులపై నాలుకతో పదే పదే చప్పరించడం వల్ల, తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ, వెంటనే పెదవుల వాపు ప్రారంభమవుతుంది. చాలా మందికి పెదవులు పగిలి రక్తస్రావం కూడా అవుతుంది. మరైతే చలికాలంలో పెదాలను ఎలా సంరక్షించుకోవాలి అని సందేహిస్తున్నారా? నిపుణుల చిట్కాలు ఇవే..

1 / 5

2 / 5
పగిలిన పెదవుల నుంచి ఉపశమనం పొందాలంటే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగాలి. శరీరం హైడ్రేట్ గా ఉంటే పెదవులు కూడా తేమగా ఉంటాయి. పెదవులు పొడిబారకుండా ఉండాలంటే చలికాలంలో నీళ్లు అధికంగా తాగాలి.

3 / 5
పెదవుల సంరక్షణలో లిప్ బామ్‌కు ప్రత్యామ్నాయం లేదు. లిప్ బామ్ పెదవుల తేమను నిలుపుతుంది. బీస్వాక్స్, షియా బటర్ లేదా కొబ్బరి నూనెతో కూడిన లిప్ బామ్‌ను ఉపయోగించడం మంచిది. లిప్ బామ్‌తో పాటు, రాత్రి పడుకునే ముందు పెదవుల సంరక్షణకు ఏదైనా హైడ్రేటింగ్ లేదా క్రిమినాశక క్రీమ్ ఉపయోగించవచ్చు. అలాగే పెదవులపై కొబ్బరినూనె లేదా నెయ్యి రాసుకున్నా ఫలితం ఉంటుంది.

4 / 5
పెదవులపై ఉన్న మృతకణాలను ఎప్పటి కప్పుడు తొలగించడం చాలా అవసరం. అందుకు పంచదార, తేనె మిక్స్ చేసి లిప్ స్క్రబ్ తయారు చేసుకోవాలి. ఈ లిప్ స్క్రబ్‌ని పెదవులపై వృత్తాకారంలో మసాజ్ చేసుకోవాలి. ఇది పగిలిన, పొడి పెదాల సమస్యను నయం చేస్తుంది. ఇలా చేయడం వల్ల క్రమంగా పెదాలకు పింక్ కలర్‌ని తిరిగి తెస్తుంది.

5 / 5
ఎండలోకి వెళ్లినప్పుడు పెదవులపై సన్‌స్క్రీన్‌ని అప్లై చేయాలి. సన్‌స్క్రీన్ UV కిరణాల నుంచి పెదాలను కాపాడుతుంది. అలాగే పెదాలు నల్లగా మారవు. పగిలిన పెదవుల సమస్యను నివారించడానికి ఆహారంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను చేర్చుకోవాలి. సీఫుడ్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్‌నట్స్ వంటి ఆహారాలు పెదాలను హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి.