
చిన్న పిల్లలకు వారు జన్మించిన 21 రోజులకు పెద్ద వారు వెండి మొలతాడు కడుతారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అంత చిన్న వయసులో వారికి వెండి మొలతాడు మాత్రమే మొదట ఎందుకు కడతారు?దీని గల కారణం ఏంటో? ఇప్పుడు దీని గురించే మనం వివరంగా తెలుసుకుందాం.

చిన్న పిల్లలకు వెండి మొలతాడు కట్టడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంట. ముఖ్యంగా ఇది వారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట. చిన్న పిల్లలకు వెండి మొలతాడు వేయడం వలన ఇది వారి నుంచి ప్రతి కూల శక్తిని దూరం చేయడమే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను కూడ చేకూరుస్తుందంట.

లోహాలు శరీరంపై వాటి ప్రత్యేక ప్రభావం చూపుతాయని చెబుతుంటారు. ముఖ్యంగా వెండికి చలువ గుణం ఎక్కువగా ఉంటుంది. అందువలన చిన్న పిల్లలకు వెండి మొలతాడు కట్టడం వలన ఇది వారి శరీరంలోని వేడిని గ్రహిస్తుందంట. అంతే కాకుండా శరీరం చల్లబడేలా చేస్తుందంట. అందుకే చిన్న పిల్లలకు వెండి మొలతాడు కడతారు అంటారు నిపుణుులు.

అంతే కాకుండా నడుముపై మలతాడు కట్టుకోవడం వలన ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుందంట. అంతేకాకుండా దీని వలన కడుపు సమస్యలు ఎక్కువగా రావు అని, అంతే కాకుండా వెన్నుముక ఆరోగ్యం కోసం కూడా చిన్న పిల్లలకు ఈ మొలతాడును కడతారంట.

ముఖ్యంగా చెడు దృష్టి నుంచి వీరిని రక్షించడానికి, చెడు దృష్ట శక్తులను దూరం చేయడానికి మొలతాడు కడతారంట. ఇక వెండి మొలతాడు కట్టడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉన్నదంట. ఇది పురుషులలో జననాంగాల ఆరోగ్యానికి, వృషణాల ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.