1 / 7
ఫ్రిజ్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలామంది తాజా పండ్లు, కూరగాయలు తినడం మర్చిపోయారు. సాధారణంగా ఫ్రిజ్ ఆహారం, కూరగాయలు, పండ్లను చెడిపోకుండా చేస్తుంది. ఏదైనా ఆహార పదార్థాన్ని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచినట్లయితే.. అది చాలా రోజుల పాటు వాటిని చెడిపోకుండా చేస్తుంది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.