
ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉండటం సర్వ సాధారణమైన విషయం. ఇది కూడా నిత్యవసర వస్తువుల్లో ఒకదానిలా మారిపోయింది. ఇందులో వంట చేయడం కూడా చాలా ఈజీ. అయితే కుక్కర్ లో వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. చాలా సులువగా వంట ముగుస్తుంది. కుక్కర్ లో అన్నీ కలిపి పెట్టేసి.. ఇతర పనులను కూడా చేసుకోవచ్చు.

ఇలా కుక్కర్ లో వంట చేయడం నిజంగా చాలా ఫ్రీగా ఉంటుంది. వంట కూడా ఈజీగా, టేస్టీగా అయిపోతుంది. కానీ ఈ కుక్కర్ లో కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు వండకూడదట. దీని వల్ల కొన్ని దుష్ప్రభావాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఒక సారి చూసేద్దాం.

చాలా మంది కుక్కర్ లో రైస్ పెడుతూ ఉంటారు. ఇలా కుక్కర్ లో అన్నం వండటం వల్ల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇది అనేక వ్యాధులకు దారి తీస్తుంది. కుక్కర్ లో వండిన అన్నం తినడం వల్ల చాలా మందికి ఊబకాయం వచ్చినట్టు పలు పరిశోధనల్లో తేలింది.

అలాగే ప్రెషర్ కుక్కర్ లో పిండి పదార్థాలను వండకపోవడమే మంచిది. ఎందుకంటే పిండి పదార్థాలు వండటం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలాగే పాస్తా కూడా కుక్కర్ లో ఉడికించకూడదు.

బంగాళ దుంపలను కుక్కర్ లో ఉడికించడం చాలా ఈజీ. చాలా మంది దీన్నే ఫాలో అవుతారు. కానీ బంగాళ దుంపల్లో స్టార్చ్ అనే పదార్థం ఉంటుంది. దీన్ని కుక్కర్ లో ఉడికించడం వల్ల.. ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే. ఇలా కుక్కర్ లో కొన్ని లాభ నష్టాలు ఉన్నప్పటికీ.. కుక్కర్ లో వండటం వల్ల ఆహారంలో ఉండే లెక్టిన్ కంటెంట్ ను తగ్గిస్తుంది. దీని వల్ల పోషకాలు బాగా అందుతాయి.