థైరాయిడ్ ట్యాబ్ లెట్స్ స్కిప్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండి!

Updated on: Oct 09, 2025 | 12:28 PM

ప్రస్తుతం చాలా మందిని బాధిస్తున్న అతి పెద్ద సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. చాలా మంది మహిళలు, యువతులు ఈ సమస్య బారిన పడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోజు రోజుకు థైరాయిడ్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అయితే థైరాయిడ్ సమస్య ఉన్న వారు తప్పకుండా ప్రతి రోజూ ఉదయం ట్యాబ్ లెట్ వేసుకోవాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. కానీ కొంత మంది మాత్రం మధ్య మధ్యలోనే థైరాయిడ్ ట్యాబ్ లెట్స్ వేసుకోవడం ఆపేస్తారు. అయితే ఇలా మధ్యలో మందులు వేసుకోవడం ఆపేయ్యడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కాగా, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

1 / 5
ప్రతి వ్యక్తిలో ఉండే సాధారణ గ్రంథిలో థైరాయిడ్ ఒకటి. ఇది గొంతు మధ్య భాగంలో ఉంటూ హార్మోన్స్ విడుదల చేస్తుంది. దీని నుంచి విడుదలయ్యే హార్మోన్స్ శరీరం మొత్తంపై ప్రభావం చూపుతాయి. అయితే ఈ థైరాయిడ్ గ్రంథి అనేది సక్రమంగా పని చేయకపోతే, ఎక్కువ హార్మోన్స్ విడుదల చేయడం లేదా, హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం జరుగుతుంది.  హార్మోన్ విడుదల తగ్గిపోతే హైపో థైరాయిడ్, ఎక్కువ మొతాదులో హార్మోన్స్ విడుదల చేస్తే హైపర్ థైరాయిడ్ అంటారు.

2 / 5
ప్రస్తుతం చాలా మంది ఈ థైరాయిడ్ సమస్య బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, యువతుల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ థైరాయిడ్ బారినపడిన వారిలో ఆకలి మందగించడం, శరీరంలో ఐరన్ తగ్గడం, జుట్టు రాలడం, కొందరు అధికంగా బరువుపెరగడం లేదా తగ్గడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంతే కాకుండా ఈ థైరాయిడ్ గ్రంథి వ్యక్తి ఎదుగుదలపైన కూడా తీవ్రప్రభావం చూపుతుంది. అందువలన దీనిని సరైన సమయంలో గుర్తించి, మెడిసిన్ వాడటం మంచిదని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

3 / 5
అయితే థైరాయిడ్ సమస్యలు అనేవి రక్త పరీక్ష ద్వారా మాత్రమే తెలుస్తాయి. ఈ సమస్యను టీ3, టీ4 స్థాయిలను బట్టీ గుర్తించి, వారికి ఆ సంబంధించిన మెడిసిన్ రిఫర్ చేస్తుంటారు. ఇక థైరాయిడ్ ఉన్నది అంటే ఆ వ్యక్తులు  మంచి డైట్ మెంటైన్ చేస్తూ, తప్పకుండా ప్రతి రోజూ థైరాయిడ్ ట్యాబ్ లెట్ వేసుకోవాలని చెబుతుంటారు. కానీ కొంత మంది ట్యాబ్ లెట్ స్కిప్ చేస్తుంటారు. కానీ ఇలా థైరాయిడ్ ట్యాబ్ లెట్స్ స్కిప్ చేయడం అస్సలే మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

4 / 5
థైరాయిడ్ ట్యాబ్ లెట్స్‌ను స్కిప్ చేయడం చాలా ప్రమాకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన టీఎస్ హెచ్ స్థాయిలపై తీవ్ర ప్రభావం పడుతుందంట.ఇది దాదాపు ఆరవారాల పాటు దాని ప్రభావం చూపుతుంది. దీని వలన అనేక సమస్యలు చుట్టుముట్టడం జరుగుతుందంట. ముఖ్యంగా తీవ్రమైన అలట,  కళ్లు తిరగడం, నిద్రలేమ, గుండె దడ వంటి సమస్యలు అధికం అవుతాయంట. అందుకే ఎట్టిపరిస్థితుల్లో థైరాయిడ్ ట్యాబ్ లెట్స్ స్కిప్ చేయకూడదంట.

5 / 5
అంతే కాకుండా ట్యాబ్ లెట్స్ వేసుకునే క్రమంలో కూడా అనేక నియమాలు పాటించాలంట. ఈ ట్యాబ్ లేట్ వేసుకున్న అరగంట వరకు ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోకూడదంట. ముఖ్యంగా టీ, కాఫీలు తీసుకోకూడదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ( నోట్ : పై సమాచారం ఇంటర్నె్ట్ ఆధారంగా, ఇవ్వడం జరిగినది, టీవీ9తెలుగు దీనిని ధృవీకరించలేదు)