Telugu News Photo Gallery These are the precautions that a mother should take with her newborn baby during the monsoon season.
వర్షాకాలంలో నవజాత శిశివుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
వర్షాకాలం వచ్చిందంటే చాాలు పిల్లలు పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారు. అందుకే ఈ వర్షాకాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
వర్షాకాలంలో నవజాత శిశువుల విషయంలో తల్లిదండ్రులు చాలా భయపడిపోతుంటారు. ఎందుకంటే ఈ సమయంలో వారు పదే పదే అనారోగ్యానికి గురి అవుతారు. అందుకే వారి విషయంలో తప్పకుండా ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఇంటి శుభ్రత, ఆహారం, నిద్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట.
వర్షాకాలంలో అప్పుడే పుట్టిన పిల్లలకు తప్పకుండా ప్రతి రెండు లేదా మూడు గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలంట. అంతే కాకుండా వారికి పాలు సరిపోయాయో లేదో కూడా చూడాలంట. ఎందుకంటే కొన్ని సార్లు పిల్లలు పాలు తాగిన తర్వాత కూడా వేళ్లు చప్పరించడం వంటి పనులు చేస్తుంటారు. ఇది వారి ఆకలికి సంకేతం కావచ్చు. అందువలన వారికి సరిపడ పాలు పట్టాలి. దాదాపు 24 గంటల్లో ఎనిమిది నుంచి 12 సార్లు పాలు పట్టాలంట.
ఇక చాలా మందిలో వర్షాకాలంలో శిశువుకు ఎన్నిసార్లు స్నానం చేయించాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయించడం మంచిదేనా ? కాదా అనే అనుమానం ఉంటుంది. అయితే అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు వారానికి కనీసం మూడుసార్లు స్నానం చేయించాలంట.ముఖ్యంగా బొడ్డు తాడు తెగిపోయే వరకు, టబ్‌లో స్నానం చేయడానికి బదులుగా స్పాంజ్ బాత్ ఇవ్వడం చాలా మంచిదంట.
తేమతో కూడిన వాతావరణం వలన కొన్ని సార్లు పిల్లల నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. అందువలన ప్రతి తల్లి ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలంట. క్రమం తప్పకుండా మీ బిడ్డ నిద్రపోయేందుకు వెచ్చటి వాతావరణం సృష్టించాలి. మెత్తటి వెచ్చటి వస్రాల్లో పడుకోబెట్టాలి.