
జైపూర్, రాజస్థాన్: నవంబర్ నెలలో ఆనందంగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే రాజస్థాన్‌లోని జైపూర్ బెస్ట్ ప్లేస్. నవంబర్ నెలలో ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా, చల్లటి ఉష్ణోగ్రతతో పింక్ సిటీ ప్రాణం పోసుకుంటుంది. ఈ మాసంలో జైపూర్‌లోని అంబర్ కోట, అంతే కాకుండా ఈ సమయంలో ఇక్కడ సాహిత్య ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అది చూస్తూ చాలా ఆనందించవచ్చును. అందుకే నవంబర్ నెలలో టూర్ ప్లాన్ చేసే వారికి ఇది అద్భుతమైన పదేశం అని చెప్పవచ్చు.

వారణాసి , ఉత్తర్ ప్రదేశ్ : నవంబర్ నెలలో ఆధ్యాత్మిక వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మాసంలో మానసిక ప్రశాంతత కోరుకొనే వారు గంగా కనుమల నుంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పొందవచ్చు, నవంబర్ నెలలో ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అందే కాకుండా సూర్యోదయ పడవ ప్రయాణాలు, గంగాహారతిని వీక్షించి, ఆధ్యాత్మిక చింతన పొందవచ్చు, ఇది మనసుకు ఎంతో ఆనందాన్ని చేకూరుస్తుంది.

హంపి, కర్ణాటక: యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపి, ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇక్కడ పురాతన శిథిలాలు, దేవాలయాలతో ఈ ప్రదేశం చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నవంబర్ నెలలోని ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటమే కాకుండా, ఈ మాసంలో ఇక్కడి రాతి ప్రకృతి పర్యాటకులకు కనుల విందునందిస్తుంది. అందువలన నవంబర్ నెలలో తప్పక పర్యటించాల్సిన ప్రదేశాల్లో హంపి కూడా ఒకటి.

రిషికేశ్, ఉత్తరాఖండ్: అద్భుతమైన పర్యాటక ప్రదేశాల్లో రిషికేశ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడి పచ్చటి ప్రకృతి , ఎత్తైన కొండలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. ముఖ్యంగా సాహస ప్రియులకు ఇది బెస్ట్ ప్లేస్, ఎందుకంటే? రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్చ యోగా రిట్రీట్‌లకు ఇది చాలా అనువైనది. అయితే రివర్ రాఫ్టింగ్ చేయాలి అనుకునే వారు మాత్రం నవంబర్ నెలలో ఈ ప్రదేశాన్ని సందర్శించడం చాలా ఉత్తమం, రివర్ రాప్టింగ్‌కు నవంబర్ నెల చాలా అనువైనది

కర్ణాటకలోని కూర్గ్: కర్ణాటకలోని మరో అద్భతమైన ప్రదేశాల్లో కూర్గ్ ఒకటి. అందమైన కొండలు, పచ్చటి చెట్లు, కాఫీ తోటలతో ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే నవంబర్ నెలలో ప్రయాణం చేయాలి అనుకుంటారో వారికి ఇది అద్భుతమైన ప్రదేశం అని చెప్పాలి.