ప్రస్తుతం మారుతోన్న జీవనశైలి కారణంగా చాలా మందిలో మలబద్ధకం సమస్య వెంటాడుతోంది. తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా చాలా మందిలో ఈ అనారోగ్య సమస్య వెంటాడుతోంది. మలబద్ధకం మరన్నో ఇతర అనారోగ్య సమస్యలకు కారణంగా మారుతోంది. అయితే మలబద్దకం ఏర్పడడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే.
మలబద్దకానికి ప్రధాన కారణం తీసుకునే ఆహారంలో సరిపడ ఫైబర్ లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. జీర్ణక్రియ రేటు మెరుగ్గా జరిగి, వ్యర్థాల్ని బయటకు పంపడంలో పీచు పదార్థాలు కీలకంగా పనిచేస్తాయి. కాబట్టి తీసుకునే ఆహారంలో వీలైనంత వరకు ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.
ఇక మలబద్ధకం సమస్య రాకుండా ఉండాలంటే శరీరం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండాలి. రోజుక కనీసం పది గ్లాసుల నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. తగినంత నీరు తీసుకోకపోతే మలబద్ధకం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక కాలంతో సంబంధం లేకుండా చలికాలం కూడా నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆఫీసుల్లో పనిచేసే వారు గంటలతరబడి అలాగే కూర్చుంటారు. మరీ ముఖ్యంగా కంప్యూటర్‌పై పనిచేసే వారు గంటలపాటు అలాగే కదలకుండా కూర్చుకుంటారు. ఇలాంటి వారిలో కూడా మలబద్ధకం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కనీసం అర గంటకు ఒకసారైనా లేచి అటుఇటు తిరగాలని నిపుణులు చెబుతున్నారు.
ఇక కొన్ని రకలు ట్యాబ్లెట్స్ తీసుకుంటున్న వారిలో కూడా మలబద్ధకం సమస్య వెంటాడుతుంది. ముఖ్యంగా హైపీబీ, ఐరన్ సప్లిమెంట్ మందులను తీసుకునే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాళ్లు వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.