
ఓలా ఎస్1 ఎయిర్(Ola S1 Air).. రూ. లక్ష లోపు బడ్జెట్ లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. ఇది సింగిల్ చార్జ్ పై 125 కిమీలు రేంజ్ ఇస్తుంది. అంతేకాక అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, 34L బూట్ స్పేస్, వైఫై కనెక్టివిటీ, జీపీఎస్ 10W స్పీకర్లు ఈ స్కూటర్ ని ప్రత్యేకంగా నిలబెడతాయి.

ఒకినావాడ్యూయల్ 100(Okinawa Dual 100).. డెలివరీ ఏజెంట్లలో డ్యూయల్ 100 ఎలక్ట్రిక్ స్కూటర్‌కు అధిక డిమాండ్ ఉంది. దీని ధర రూ. 79,813 ధర (ఎక్స్-షోరూమ్). ఇది 200 కిలోల లోడింగ్ సామర్థ్యం కలిగి ఉంది. దీనిలోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 149 కి.మీల రేంజ్ ఇస్తుంది.

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్(Hero Electric Optima Cx).. హీరో ఎలక్ట్రిక్ దేశంలోని పురాతన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటి. ఇది చాలా కాలం పాటు అమ్మకాల పరంగా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఓలా ఎలక్ట్రిక్ వచ్చాక దీని స్థానాన్ని అది ఆక్రమించింది. డ్యూయల్ బ్యాటరీ సెటప్ కలిగిన ఈస్కూటర్ ధర రూ. 85,190 (ఎక్స్-షోరూమ్). ఇది సింగిల్ ఛార్జ్ పై 140 కిమీ వస్తుందని కంపెనీ క్లయిమ్ చేసుకుంది.

టీవీఎస్ ఐక్యూబ్(Tvs Iqube).. వినియోగదారుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తున్న మరో బైక్ టీవీఎస్ ఐ క్యూబ్. దీని ధర 99,999 గా ఉంది. దీనిలోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 100 కిమీల రేంజ్ ని ఇస్తుంది. దీనిలో 7-అంగుళాల డిజిటల్ స్క్రీన్, ఎల్ఈడీ లైట్లు, హెచ్ఎంఐ కంట్రోలర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్(Ampere Magnus Ex).. ఇది కూడా మంచి ఎంపికే. దీని ధర కేవలం రూ. 81,900 (ఎక్స్-షోరూమ్). సింగిల్ చార్జ్ పై 121 కిమీల పరిధిని అందిస్తుంది . ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 50 కిమీ. దీనిలోని బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి సుమారు 4-5 గంటలు పడుతుంది.