వర్షపు చినుకుల్లో తడుస్తూ.. అందమైన ప్రాంతాలు చుట్టేయ్యాలా.. !

Updated on: Jul 01, 2025 | 9:25 PM

వర్షాలు మొదలయ్యాయి. దీంతో చాలా మంది తమ స్నేహితులతో జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. వర్షపు చినుకుల్లో తడుస్తూ అందమైన ప్రాంతాలు చుట్టేయ్యాలనుకుంటారు. అలాంటి వారికోసమే అద్భుతమైన సమాచారం. స్నేహితులతో టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు వర్షాకాలంలో చూడటానికి అందమైన ప్రదేశాలు ఇవే.

1 / 5
మున్నార్, కేరళ : వర్షాకాలంలో మున్నార్ వాతావరణం ఓ అద్భుతం అనే చెప్పాలి. మంచుతో కప్పబడిన కొండలు, ఉత్సాహభరితమైన పచ్చని టీ తోటలు, ఉప్పొంగుతున్న జలపాతాలతో మున్నార్ తన అందాలతో పర్యాటకుల మనసు దోచేసుకుంటుంది. ప్రశాంతమైన ప్రకృతి సుందరమైన  దృశ్యాలు  చూడటానిక వర్షంలో తడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ అందమైన ప్రకృతి చూడటానికి రెండు కళ్లు సరిపోవు.

2 / 5
రిషికేశ్, ఉత్తరాఖండ్ :  వర్షకాలంలో ఎంజాయ్ చేయడానికి ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ బెస్ట్ ప్లేస్. ఇక్కడ ఇప్పుడు పర్యటకులు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే? వర్షాకాలంలో గంగానది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండటంతో, ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందువలన మీరు మీ స్నేహితులతో, నదీ తీరంలో నడుచుకుంటూ నీటి ప్రవాహాలను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.

3 / 5
కూర్గ్, కర్ణాటక: కర్ణాటకలోని అందమైన ప్రదేశాల్లో కూర్గ్ ఒకటి. వర్షాకాలంలో కూర్గ్‌లోని పచ్చని కాఫీ ఎస్టేట్‌లు, అటవీ దారులు అద్భుతంగా ఉంటాయి. ఒంటరిగా వచ్చే సందర్శకులు ఏకాంతాన్ని ఇవ్వడంలో ఇది ముదుంటుంది. పొగమంచు, మంచుతో కప్పబడిన కొండలు, తేలికపటి చినుకుల మధ్య  ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును.

4 / 5
చిరపుంజీ, మేఘాలయ: రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతున్న చిరపుంజీ వర్షాకాలంలో ఒక అద్భుత ప్రదేశంగా మారుతుంది. ఒంటరిగా ప్రయాణికులు లివింగ్ రూట్ బ్రిడ్జిలకు వెళ్లి ట్రెక్కింగ్ చేయవచ్చు,  గుహలను చూస్తూ, పొగమంచుతో కప్పబడిన కొండలు, పచ్చని చెట్లు, జలపాతాల సందడి చూస్తూ ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును.

5 / 5
తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్: సాహసోపేతమైన ఒంటరి ప్రయాణికులకు అద్బుతమైన ప్రదేశం తవాంగ్. వర్షాకాలంలో హిమాలయాల అందాలను చూడటానికి ఇది బెస్ట్ ప్లేస్. పురాతన మఠాలపై మేఘాలు వేలాడుతున్నాయా అన్నట్లు కనిపించే ప్రదేశాలు. ప్రశాంతమైన వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది.