Electric Scooters: మహిళలకు బెస్ట్ ఈ-స్కూటర్లు ఇవే.. సూపర్ డిజైన్.. తిరుగులేని ఫీచర్లు..

|

Mar 11, 2024 | 1:22 PM

ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో తమ సత్తా చాటుతున్నాయి. సంప్రదాయ పెట్రోల్ స్కూటర్లకు దీటుగానే సేల్స్ రాబడుతున్నాయి. ఇవి అటు పురుషులకు, మహిళలకు కూడా ఉపయోగపడుతుండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఈ స్కూటర్లలో అత్యాధునిక ఫీచర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కువ దూరాలకు కాదు గానీ.. సిటీ పరిధిలో, ఇంటి పనులకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా మహిళలు తమ పనులు తామే చేసుకునేందుకు ఇవి చక్కగా ఉపకరిస్తున్నాయి. ఈ క్రమంలో మహిళలకు ఉపయోగపడే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటి ధరలు అందుబాటులోనే ఉంటాయి.

1 / 5
ఒడిస్సే రేసర్ లైట్ వీ2.. ఈ స్కూటర్ లో శక్తివంతమైన నీటి నిరోధకత కలిగిన మోటార్ ఉంటుంది. అలాగే లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది కేవలం మూడు నుంచి నాలుగు గంటలలో పూర్తిగా చార్జ్ అవుతుంది. ఇది 75 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఎల్ఈడీ లైట్లు, విస్తారమైన బూట్ స్పేస్, సుదీర్ఘ ప్రయాణాలకు డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్ వేరియంట్‌తో ఇది వస్తుంది. ప్రకాశవంతమైన ఎరుపు, పాస్టెల్ పీచ్, నీలమణి నీలం, పుదీనా ఆకుపచ్చ, పెర్ల్ వైట్ లేదా కార్బన్ బ్లాక్‌ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీనిపై ప్రస్తుతం పలు ఆఫర్లు ఉన్నాయి. ఆఫర్లలో దీనిని రూ.76,250 (ఎక్స్-షోరూమ్)కి కొనుగోలు చేయొచ్చు.

2 / 5
ఒకినావా రిడ్జ్ 100.. ఈ స్కూటర్లో శక్తివంతమైన 800వాట్ల మోటార్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ దీనిలో ఉంటుంది. దీనిలోని బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 49 కి.మీ పరిధిని ఇస్తుంది. రిడ్జ్ 100 సెంట్రల్ లాకింగ్, యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, జియో-ఫెన్సింగ్ వంటి అధునాతన ఫీచర్‌లతో నిండి ఉంటుంది. దీని ధర రూ.1,15,311 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

3 / 5
ఓలా ఎస్1.. ఈ స్కూటర్లో అడ్వాన్స్ డ్ ఫీచర్లు ఉన్నాయి. రిమోట్ లాక్/అన్‌లాక్, జీపీఎస్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్‌ల వంటి అధునాతన ఫీచర్‌లతో కూడిన కాంపాక్ట్ డిజైన్‌ను అందిస్తుంది. 8.5కేడబ్ల్యూ మోటారుతో నడిచే మోడల్‌లతో, ఆకట్టుకునే వేగం, రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

4 / 5

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్.. ఈస్కూటర్లో 550వాట్ల బీఎల్డీసీ మోటార్, 52.2V, 30Ah లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. దీనిలోని మోటార్ గరిష్టంగా 1.2బీహెచ్పీ శక్తిని అందిస్తుంది. ఈస్కూటర్ సింగిల్, డబుల్ బ్యాటరీ వేరియంట్‌లలో లభిస్తుంది. రెండు బ్యాటరీల సాయంతో సింగిల్ చార్జ్ పై ఏకంగా 140 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ.1,06,590 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

5 / 5
ఆంపియర్ మాగ్నస్.. ఈ స్కూటర్ ఈఎక్స్ ఇంటిగ్రేటెడ్ యూఎస్బీ పోర్ట్, ఎల్సీడీ స్క్రీన్, కీలెస్ ఎంట్రీ, యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ఫీచర్‌లతో లోడ్ చేసి ఉంటుంది. 1.2 కేడబ్ల్యూ మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 55 వేగంతో ప్రయాణించగలుగుతుంది. 60V, 30Ah బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 121 కిమీల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.93,900 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.