కిరాణా షాపుకి లేదా సూపర్ మార్కెట్‌కి వెళ్లినప్పుడు నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు కొంటుంటారు. అందుకోసం పెద్దమొత్తంలో పప్పు, ఉప్పు, నూనె వంటి వాటిని కొనుగోలు చేస్తుంటారు. నెలకు సరిపడా కిరాణా సామాన్లు కొని భద్రపరిచినా పాడవుతుందనే భయం ఉండదని చాలా మంది అనుకుంటారు. అయితే మర్చిపోయి కూడా ఈ 5 రకాల వస్తువులను కొనకూడదట. వీటిని పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తే నాణ్యత కోల్పోతాయట.
కారం, పసుపు పొడి, జీలకర్ర, కొత్తిమీర, మిరియాలు, బే ఆకు వంటి సుగంధ ద్రవ్యాలు అవసరం మేరకే కొనుగోలు చేయాలి. అధిక కాలం నిల్వ చేస్తే సుగంధ ద్రవ్యాల నాణ్యత కోల్పోతాయట.
పాలు, పాల ఉత్పత్తులు రెండు రోజులకు మించి ఫ్రిజ్‌లో ఉంచితే పాడైపోతుంది. అందుకే పెద్ద మొత్తంలో పాల ఉత్పత్తులను నిల్వ చేయకూడదు. వాల్‌నట్స్, బాదం, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటిని కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయకూడదు. ఎక్కువ రోజులు నిల్వ చేస్తే వీటి రుచి మారిపోతుంది.
అలాగే ప్రతి నెల 5 లీటర్ల నూనె కొనుగోలు చేయటం కూడా సాధారణమే. నూనె కూబి ఎక్కువ కాలం నిల్వ ఉంచినట్లయితే, దాని నాణ్యత క్షీణిస్తుంది. అందుకే 1-2 లీటర్ల కంటే ఎక్కువ నూనె కొనుగోలు చేయకూడదు.
నెల మొత్తానికి సరిపడా గోదుమ పిండిని చేసే అలవాటు మీకున్నట్లయితే దీనిని మీరు వెంటనే మానుకోవాలి. పిండిని ఎల్లప్పుడు తక్కువ పరిమాణంలో మాత్రమే కొనుగోలు చేసి గాలి చొరబడని కంటైనర్‌లలో నిల్వ చేసుకుంటే నాణ్యంగా ఉంటుంది.