Jyothi Gadda |
Mar 03, 2023 | 8:27 PM
మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, హార్మోన్లను సమతుల్యం చేయడానికి ఒక ప్రసిద్ధ సహజ నివారణగా జాస్మిన్ ఆయిల్‌ను అనేక ఏళ్ల కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు వాస్తు దోషానికి తగిన నివారణ.
ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో, మల్లె నూనెను డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి మరియు నిద్రలేమికి సహజ నివారణగా వాడుతున్నారు. ఆరోగ్యంతో పాటు వాస్తు దోషానికి కూడా మల్లెనూనె తగిన నివారణ.
జాస్మిన్ ఆయిల్ ధర కేవలం ఒక లీటరుకు రూ.4 లక్షలు. 1 లీటరు నూనెను సేకరించేందుకు 5,000 మల్లె మొగ్గలు అవసరం పడుతుందట.
పువ్వు వికసించినప్పుడు, భారతదేశంలోని ఉత్పత్తిదారులు దానిని ప్రపంచంలోనే అత్యంత విలువైన నూనెలలో ఒకటిగా త్వరగా ప్రాసెస్ చేస్తారు.
జాస్మిన్ ఆయిల్ అనేక విలాసవంతమైన పరిమళ ద్రవ్యాలలో ఒకటి. ఈ నూనె అత్యంత ఖరీదు అని చెబుతారు.
ఈ జాస్మిన్ ఆయిల్ వాస్తు దోషానికి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. కెరీర్‌లో విజయం సాధించాలనుకునే వారు ఈ నూనెను ఇంట్లో ఉంచుకోవాలి. ఇది మీ సమస్యలను పరిష్కరిస్తుంది. సానుకూలతను వ్యాప్తి చేస్తుంది.
మల్లెపూల నూనెను ఇంట్లో పెడితే ఆ ఇంటి వారికి ఆత్మవిశ్వాసం, బలం చేకూరుతాయి.