Winter Superfood: శీతాకాల సూపర్ ఫుడ్.. ఉసిరి తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Updated on: Nov 11, 2025 | 5:59 PM

ఉసిరికాయ ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సూపర్ ఫుడ్. విటమిన్ Cకు నిలయం. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు, అలర్జీలను తగ్గిస్తుంది. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. శీతాకాలంలో రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను మీరు పొందవచ్చు.

1 / 5
ప్రకృతి మనకు అందించిన అత్యంత విలువైన ఔషధాల్లో ఉసిరికాయ ఒకటి. శీతాకాలంలో పుష్కలంగా లభించే ఈ ఇండియన్ గూస్‌బెర్రీలో పోషకాలు అపారం. ఆయుర్వేదంలో దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. ఉసిరికాయ విటమిన్ సి కి పవర్‌హౌస్‌గా పరిగణిస్తారు.

2 / 5
ఒక చిన్న ఉసిరికాయలో ఉండే విటమిన్ సి ఒక నారింజ పండులో ఉండేదాని కంటే 20 రెట్లు ఎక్కువ. ఇది రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచి, శరీరాన్ని వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది.

3 / 5
శీతాకాలంలో ప్రతిరోజూ రెండు ఉసిరికాయలు తినడం వల్ల జలుబు, దగ్గు, అలర్జీ సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించిన హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.

4 / 5
మధుమేహం ఉన్నవారికి ఉసిరికాయ చాలా మేలు చేస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

5 / 5
అంతేకాకుండా, ఉసిరికాయ రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఉసిరికాయను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.