Monsoon Skin Care: వర్షాకాలంలో జాగ్రత్త..! మీ చేతులు కాళ్లను శుభ్రంగా, మెరుస్తూ ఉంచుకోవటం ఎలాగంటే..

|

Jun 28, 2023 | 9:21 PM

ఇంట్లో తయారు చేసే స్క్రబ్: పసుపు, కాఫీ, పంచదారతో ఈ స్క్రబ్‌ను తయారు చేసి ఒక గిన్నెలో వేసి ఫ్రిజ్‌లో ఉంచండి. వారానికి ఒకసారి అప్లై చేయడం వల్ల చాలా పని చేస్తుంది. చేతులు, కాళ్లు శుభ్రంగా ఉంటాయి.

1 / 7
మనం ముఖాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లు చేతులు, కాళ్లను పట్టించుకోం. కానీ, వర్షాకాలంలో చేతులు, కాళ్లను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే.. కాళ్లు, చేతులపై మురికి నీరు పడుతుంది. దాంతో పాటు ఇన్ఫెక్షన్ భయం కూడా ఉంటుంది.

2 / 7
మురికి నీటి బురద కూడా వివిధ ఇన్ఫెక్షన్లకు సంభావ్యతను కలిగి ఉంటుంది.  చేతులు, కాళ్ళ చర్మంపై  నల్ల మచ్చలు ఏర్పాడుతుంటాయి. ఈ సమయంలో చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి.  బ్యూటీ ట్రీట్‌మెంట్లు చేయడానికి పార్లర్‌కు వెళ్లడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు.  పెడిక్యూర్, మానిక్యూర్ అవకాశాలు ప్రతిసారి ఉండవు.

3 / 7
కాబట్టి ఈ ప్యాక్ ను ఇంట్లోనే తయారు చేసుకోండి. ఈ ప్యాక్‌ని వారానికి ఒకసారి అప్లై చేయడం వల్ల లాభం ఉంటుంది.  మీరు ఈ ప్యాక్‌ను తయారు చేసి 1-15 నెలల వరకు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఇది చర్మం pH సమతుల్యతను కాపాడుతుంది.

4 / 7
ఒక చెంచా పసుపు పొడి, ఒక చెంచా కాఫీ పొడిని బాణలిలో వేసుకుని నల్లగా మారే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.

5 / 7

ఒక చెంచా పంచదార, మూడు చెంచాల కర్పూరం బాగా పౌడర్ చేసి వేసుకోవాలి. పసుపు-కాఫీ పొడిని పంచదార-కర్పూరం పొడిని వేసి కలపండి.

6 / 7
ఇప్పుడు అందులో మూడు చెంచాల కొబ్బరి నూనె కలపాలి. మొత్తం మీద చాలా మంచి స్క్రబ్ తయారవుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం..

7 / 7
ఈ ప్యాక్ పొడిగా కాకుండా తడిగా అప్లై చేసుకున్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. చర్మంపై కొన్ని చెంచాల నీటిని పోసి, ఆపై ఈ ప్యాక్‌ను అప్లై చేయండి. తర్వాత 20 నిమిషాలు అలాగే ఉంచి నీళ్లతో కడిగేయాలి. చేతులు, కాళ్ళు మునుపటి కంటే చాలా శుభ్రంగా తయారవుతాయి.