
చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే మామూలుగా తినడం వల్ల ఈ సమస్యలు రాకుండా ఉంటాయి.

మీకు జ్వరం లేదా కఫం సమస్య ఉంటే మీరు ఎండు అల్లం, బెల్లం కలిపి తినాలి. ఈ రెండింటి కలయిక చాలా కంఫర్ట్‌ని ఇస్తుంది.

చర్మం, జుట్టుకి సంబంధించిన సమస్యలను తొలగించడానికి హలీమ్ గింజలను బెల్లంతో కలిపి తినాలి. ఇది శరీరంలోని ఫోలిక్ యాసిడ్, ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది.

నోటి నుంచి దుర్వాసన వస్తుంటే బెల్లం, మెంతులు కలుపుకుని తినాలి. ఇది నోటి ఆరోగ్యానికి చాలా మంచిది.

పసుపును బెల్లంతో కలిపి తీసుకోవడం ద్వారా స్త్రీల ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి.