ముంచుకొస్తున్న ముప్పు.. ఇక తాగు నీటి కష్టాలే..

Edited By:

Updated on: Jul 18, 2026 | 3:09 PM

ఎల్ నినో ఎఫెక్ట్ తో మంచిర్యాల జిల్లాకు తాగునీటి గండం ముంచుకొస్తోంది. తలాపునే గోదావరి ఉన్నా.. ఎగువన ఎల్లంపల్లి జలాశయం ఉన్నా.. వర్షాకాలంలోను జలమో రామచంద్రా అనాల్సి పరిస్థితి ఎదురవబోతోంది. గోదావరి నది ఒడ్డునే ఉన్నా మంచిర్యాల జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు.. 150 పైగాగ్రామాలు తాగునీటి సంక్షోభం అంచున కనిపిస్తున్నాయి.

1 / 5
 ఎండాకాలంలో మాత్రమే తాగు నీటి కష్టాలను‌ ఎదుర్కొన్న పల్లెలు వర్షాభావ పరిస్థితులతో వాగులు, వంకలు ఎండిపోయి భూగర్భజలాలు దారుణంగా పడిపోవడం తో కరవు కోరల అంచున నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయని అయిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సైతం ఎండి ఎడారిగా మారుతుండటంతో వాట్ నెక్ట్స్ అంటోంది సర్కార్. ఎల్ నినో ఎఫెక్ట్ ను ఎదురించి మంచిర్యాల జిల్లాకు తాగునీటిని అందించడం సాధ్యమేనా.. ఎల్లంపల్లి ఆవల చేపట్టబోయే ఫ్లాన్ బి ఆపరేషన్ తో మంచిర్యాలకు తాగు నీటి గండం పొంచి ఉన్నట్టేనా..?

2 / 5
ఎల్లంపల్లి తెలంగాణ వరప్రదాయిని. ఇటు మంచిర్యాల జిల్లా అటు పెద్దపల్లి జిల్లా అంతకు మించి రాష్ట్ర రాజదాని హైదరాబాద్ కు తాగునీటిని అందిస్తూ రెండు కోట్ల జనం దాహం తీరుస్తున్న బృహత్తర ప్రాజెక్ట్. ప్రారంభానికి ముందు నుండే సాగుకు , తాగుకు ఎలాంటి డోకా లేకుండా కరువు కోరల నుండి రాష్ట్రాన్ని బయట పడేసిన ఘనత సొంతంచేసుకుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఎల్ నినో ఎఫెక్ట్ తో ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఎగువన మహారాష్ట్ర లో వర్షాలు లేకపోవడం గోదావరికి చుక్క వరద నీరు రాకపోవడంతో ఇన్ ఫ్లో జీరోగా నమోదు చేసుకుంటూ.. వర్షా కాలంలోను వేసవి కాలం కష్టాలను ఎదుర్కొంటోంది.

3 / 5
ఎన్నడు లేని విధంగా జులై మాసంలో భారీగా నీటిమట్టం పడిపోతుండటంతో ఎల్లంపల్లి డెడ్ స్టోరేజీకి చేరువైంది. రోజుకు 0.15 టీఎంసీల చొప్పున నిల్వ నీరు తాగునీటి అవసరాలక కోసం తరలిపోతుండటం తో మరో మూడు వారాల్లోగా ప్రాజెక్ట్ లోకి వరదలు రాకుంటే 5 టీఎంసీలకు నీటినిల్వ పడిపోనుంది. ఇదే జరిగితే మంచిర్యాల జిల్లా జనానికి మిషమ్ భగీరథ ద్వారా అందించే తాగునీటికి గండం ఎదురవనుంది. ప్రస్తుత నీటిమట్టం 148 అడుగులకు గాను 142.20 అడుగులుగా కొబసాగుతుండగా..  నీటి సామర్థ్యం 20.1754 టీఎంసీలకు గాను 7.7255 టీఎంసీలు గా ఉంది.

4 / 5
ఇన్ ఫ్లో  జీరో గా నమోదవుతుండటంతో  హైదరాబాద్ మెట్రోపాలిటిన్, పెద్దపల్లి , మంచిర్యాల జిల్లాల  తాగునీటి అవసరాలతో దాదాపు  440 క్యూసెక్కుల నీరు తరలిపోతోంది. మంచిర్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 265కి పైగా గ్రామాలకు ఎల్లంపల్లి‌ ద్వారా తాగునీటు సరపరా అవుతుంది. ఎల్ నినో ఎఫెక్ట్ తో తాగునీటి సంక్షోభాన్ని ఎదురుకునేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటిన్‌ వాటర్ బోర్ట్ ఫ్లాన్ బి అమలు చేస్తుండగా.. ఎల్లంపల్లి కి కుడి వైపు ఒడ్డున ఉన్న మంచిర్యాల మిషన్ భగీరథ ట్యాంకు వద్ద సైతం అదే స్థాయిలో ప్రణాళిక రెడీగా ఉందంటోంది మిషన్ భగీరథ అధికార యంత్రాంగం.

5 / 5
 ముందు జాగ్రత్త చర్యగా తాగునీటి సంక్షోభాన్ని నివారించేందుకు, ప్రాజెక్టులోని మిషన్ భగీరథ పథకం యొక్క ఇన్‌టేక్ బావికి నది నుండి నీటిని మళ్లించడానికి 2024 ఏప్రిల్ లో సుమారు రూ. 7 లక్షలు ఖర్చు చేసి 700 మీటర్ల పొడవైన కందకాన్ని తవ్వడం ఇప్పుడు కలిసి వచ్చే అంశమే అయినా.. ఇది ఎల్లంపల్లిలో 4 టీఎంసీల నీటి నిల్వ ఉన్నంత వరకు మాత్రమే నీటిని అందించగలదన్నది అధికారుల సమాధానం. ఈ జూలై నెలలోగా వరదలు రాకపోతే మాత్రం.. సెప్టెంబరు చివరి వారం వరకు మాత్రమే తాగునీటిని అందించగలమని.. ఆ తర్వాత తామేమి చేయలేం అంటోంది అధికార యంత్రాంగ. ఎల్లంపల్లి డెడ్ స్టోరేజీ మూడు టీఎంసీలుకాగా.. ప్రమాదానికి కేవలం 4 టీఎంసీల సమీపంలోనే ఉంది ఎల్లంపల్లి. మరో మూడు టీఎంసీల నీటి నిల్వలు పడిపోతే మాత్రం జలమో రామచంద్రా అనక తప్పని పరిస్థితి.

Follow Us