- Telugu News Photo Gallery Technology photos Wings launching new earbuds Wings Flobuds 200 TWS price and features Telugu Tech news
Wings Flobuds: రూ. 899కే సూపర్ ఇయర్‌బడ్స్.. నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో పాటు
ఒకప్పుడు ఇయర్ బడ్స్ ధర వేలల్లో ఉండేవి. కానీ కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. వెయ్యి రూపాయలకే ఇయర్ బడ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో పలు రకాల బ్రాండ్స్‌కు చెందిన ఇబయర్ బడ్స్ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వింగ్స్ కంపెనీ కొత్త ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఫ్లోబడ్స్ 200 టీడబ్ల్యూఎస్ పేరుతో బడ్జెట్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేశాయి. రూ. 899కే అందుబాటులోకి వచ్చిన ఈ ఇయర్ బడ్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఎక్కడ అందుబాటులో ఉంది.?లాంటి పూర్తి విషయాలు మీకోసం..
Updated on: Aug 05, 2023 | 11:53 AM

ప్రముఖ గ్యాడ్జెట్ కంపెనీ వింగ్స్.. 'ఫ్లోబడ్స్ 200 టీడబ్ల్యూఎస్' పేరుతో కొత్త ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఇయర్ బడ్స్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ ఇయర్ బడ్స్ ధర రూ. 899గా ఉంది. ఇయర్ బడ్స్‌కు సెమీ ట్రాన్స్‌పరెంట్ కేస్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ధర తక్కువే అయినా ఈ కేస్ ఇయర్ బడ్స్‌కు రిచ్ లుక్‌ను తీసుకొచ్చాయి.

ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 13mm హై-ఫిడిలిటీ డ్రైవర్‌లను అందించారు. టచ్ కంట్రోల్‌తో పని చేయడం వీటి ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఫ్లోబడ్స్ 200లో ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని అందించారు. చుట్టు పక్కల ఎంత సౌండ్ డిస్టబెన్స్ ఉన్నా వాయిస్ స్పష్టంగా వినిపించడం ఈ టెక్నాలజీ సొంతం.

ఇక ఇందులో 40 ఎమ్‌ఎస్ వరకు లెటెన్సీ ఉంటుంది. దీంతో స్మార్ట్ ఫోన్‌లో గేమ్స్ ఆడుకునే వారికి మంచి సౌండ్ ఎఫెక్ట్ అనుభూతిని పొందొచ్చు. అంతేకాకుండా దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్షన్ కోసం IPX5 రేటింగ్‌ను ఇచ్చారు.




