Vivo V30e: అదిరే లుక్స్‌, ఆకట్టుకునే ఫీచర్స్‌.. వివో నుంచి స్టన్నింగ్‌ ఫోన్‌..

|

Apr 26, 2024 | 1:44 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో భారతమార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివోవీ30 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. వివోవీ 29ఈకి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
 చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. వివోవీ 30 ఈ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఇందులో క్వాల్‌కం స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 1 ప్రాసెసర్‌ను అందించారు. వివోవీ29ఈకి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

2 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో లాంచ్‌ చేయనున్న ఈ ఫోన్‌లో కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ ఫోన్‌ను రెడ్, సిల్క్ బ్లూ కలర్స్‌లో తీసుకొస్తున్నారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఆరా ఎల్ఈడీ ఫ్లాష్ ఇందులో ప్రత్యేకంగా అందించారు.

4 / 5
నాలుగేళ్లపాటు బ్యాటరీ మంచి లైఫ్‌ ఇస్తుందని కంపనీ చెబుతోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ చేసింది. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో కర్వడ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్‌గా దీనిని చెబుతున్నారు.

5 / 5
ఇక ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ వేరియంట్ ధర రూ. 25,999గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌ టాప్‌ ఎండ్ మోడల్‌ ధర రూ. 30వేలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.