Vivo V25 Pro: వివో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఆ ఫీచర్‌తో వస్తోన్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదే.. స్పెషల్‌ ఫీచర్‌ ఏంటంటే..

|

Aug 15, 2022 | 10:57 AM

Vivo V25 Pro: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ సంస్థ వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఆగస్టు 17న భారత్‌లో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో తాజాగా భారత్‌లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వీ25 ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. ఆగస్టు 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు.

2 / 5
 ఈ స్మార్ట్‌ఫోన్‌లో రంగులు మార్చే బ్యాక్‌ ప్యానెల్‌ను అందిస్తున్నట్లు వివో ఇది వరకే తెలిపింది. ఈ ఫీచర్‌తో వస్తోన్న తొలి స్మార్ట్‌ ఫోన్‌గా వివో వీ25 ప్రో నిలిచింది. ఇందులో 3డీ కర్వ్‌డ్‌ స్క్రీన్‌ను అందించనున్నారు.

3 / 5
వీవో వీ25 ప్రోలో 6.62 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ AMOLED డిస్‌ప్లేను ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమన్‌సిటీ 1300 ప్రాసెసర్‌పై పని చేస్తుంది.

4 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 66 వాట్సాప్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4830 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. దీంతో బ్యాటరీ త్వరగా చార్జింగ్‌ అవుతుంది.

5 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ధర రూ. 35,000 నుంచి రూ. 40,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది.