- Telugu News Photo Gallery Technology photos Vivo Launches new smart phone in india have a look on Vivo v23e 5g features and price
Vivo V23e 5G: వివో నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేసింది.. 44 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్లు.
Vivo V23e 5G: వరుసగా కొత్త 5జీ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోన్న స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వీ23ఈ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి..
Updated on: Feb 23, 2022 | 8:29 AM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇటీవల వరుసగా కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్న ఈ సంస్థ వివో వీ23 ఈ 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఆండ్రాయడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ఇక 6.44 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఏఎంవోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం.

ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఎస్‌వోసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ చేసే 4050 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 44 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చిన ఈ ఫోన్ అసలు రూ. 28,990 కాగా ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు రూ. 25,990కే అందుబాటులోకి రానుంది.




