
మోటోరోలా ఎన్‌విజన్ ఎక్స్ సిరీస్ 55 అంగుళాల క్యూ ఎల్‌ఈడీ టీవీ ఈ సేల్ రూ.30,999కు అందుబాటులో ఉంది. 3840 x 2160 రిజల్యూషన్‌తో అద్భుతమైన 4కుఏ అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేతో వచ్చే ఈ టీవీ గూగుల్ టీవీ ఆధారంగా పని చేసే డ్యూయల్-బ్యాండ్ వైఫైకు మద్దతునిస్తుంది. ఈ టీవీ రెండు 20 వాట్స్ ఆర్‌ఎంస్ డౌన్-ఫైరింగ్ స్పీకర్ల ద్వారా మంచి ఆడియోను అవుట్‌పుట్ అందిస్తుంది, విస్తృత 178 డిగ్రీల వీక్షణ కోణంతో వచ్చే ఈ టీవీలో టైమర్ సదుపాయం కూడా ఉంది.

బ్లౌపంక్ట్ 55 ఇంచుల స్మార్ట్ టీవీ ఈ సేల్‌లో రూ.28,499కు అందుబాటులో ఉంది. సైబర్‌సౌండ్ జీ2 సిరీస్ 55-అంగుళాల టీవీ 3840 x 2160 రిజల్యూషన్‌తో ఆకర్షణీయమైన అల్ట్రా హెచ్‌డీ (4కే) డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అంతర్నిర్మిత వైఫై, గూగుల్ టీవీతో పాటు విస్తృతమైన యాప్ సపోర్ట్‌ను కలిగి ఉంది. 4 బాక్స్ స్పీకర్‌ల ద్వారా 60 వాట్స్ ఆర్‌ఎంఎస్ సౌండ్‌ని అందిస్తుంది.

హైసెన్స్ టోర్నడో టీవీ ఈ సేల్‌లో రూ.35,999కు అందుబాటులో ఉంటుంది.ఈ 55-అంగుళాల టీవీ 3840 x 2160 రిజల్యూషన్‌తో అద్భుతమైన అల్ట్రా హెచ్‌డీ (4కే) డిస్‌ప్లేతో వస్తుది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్-బ్యాండ్ వైఫై, గూగుల్ టీవీతో పాటు అన్ని ఆండ్రాయిడ్ యాప్స్‌కు మద్దతునిస్తుంది. డాల్బీ అట్మోస్ టెక్నాలజీ 61 వాట్స్ ఆర్‌ఎంఎస్ స్పీకర్లు మంచి సౌండ్ అవుట్‌పుట్‌ను అందజేస్తుంది.

ఐఫాల్కాన్ యూ62 సిరీస్ 55 అంగుళాల టీవీ రూ.25,999కు కొనుగోలు చేయవచ్చు. 3840 x 2160 రిజల్యూషన్‌తో అల్ట్రా హెచ్‌డీ (4కే) డిస్‌ప్లేతో వచ్చే ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, యూ ట్యూబ్, వంటి ప్రముఖ యాప్‌లకు యాక్సెస్‌తో గూగుల్ టీవీ ఆధారంగా పని చేస్తుంది. 24 వాట్స్ ఆర్‌ఎంస్ ఆడియో అవుట్‌పుట్, 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు విస్తృత 178 డిగ్రీ వీక్షణ కోణం ఈ టీవీ ప్రత్యేకతలు.

తోషిబా ఎం550 ఎల్‌పీ సిరీస్ 55 అంగుళాల క్యూఎల్‌ఈడీ టీవీ రూ.39,999కు కొనుగోలు చేయవచ్చు. 3840 x 2160 రిజల్యూషన్‌తో వచ్చే ఈ టీవీ అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీకు సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్-బ్యాండ్ వైఫైతో పని చేసే ఈ టీవీ మూడు జంట స్పీకర్ల ద్వారా 49 వాట్ ఆర్‌ఎంఎస్ సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. డాల్బీ అట్మోస్‌తో సహా వివిధ ఆడియో ఫార్మాట్‌లకు మద్దతు ఇస్తుంది.