Oppo A79 5G: ఒప్పో నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ..
ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్‌ల హవా నడుస్తోంది. 5జీ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో 5జీ హ్యాండ్‌సెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా తక్కు బడ్జెట్‌లో 5జీ ఫోన్‌లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఏ79 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి.? చూద్దాం..