Smartphones under 10k: భలే చవక బేరం.. రూ. 10వేల లోపు ధరలోనే అద్భుతమైన ఫోన్లు.. పనితీరులో మాత్రం తగ్గేదే లే..

|

May 27, 2023 | 1:42 PM

మన దేశంలో నామినల్ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లకు చాలా డిమాండ్ ఉంది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువ వీటినే కొనుగోలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 320 మిలియన్ల ప్రజలు ఇంకా నార్మల్ ఫీచర్ ఫోన్లనే వినియోగిస్తున్నారంట. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా తక్కువ ఫీచర్లు, అధిక పనితీరు గల ఫోన్లను తీసుకొస్తున్నాయి. భారీ ర్యామ్ సైజ్.. మంచి కెమెరా క్వాలిటీ.. ఏ మాత్రం విసుగు తెప్పించని ప్రాసెసింగ్ తో ఈ స్మార్ట్ ఫోన్లు ఆకట్టుకుంటున్నాయి. వీటి ధర కూడా కేవలం రూ. 10,000లోపే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 10వేల లోపు ధరలో లభించే పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లను చూద్దాం రండి..

1 / 5
నోకియా సీ32.. ఈ ఫోన్ బేస్ మోడల్ ధర రూ. 8,999. దీనిలో 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. దీని డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది. స్టాక్ ఆండ్రాయిడ్ యూఐ, క్లాస్ లీడింగ్ ఫీచర్లు ఉంటాయి. ఇది నీరు, ధూళి నిరోధకత కోసం ఐపీ52 రేటింగ్‌ను కలిగి ఉంది. దీనిలో బ్యాటరీ గరిష్టంగా 3 రోజుల పాటు వస్తుంది.

2 / 5
రెడ్ మీ ఏ2.. ఈ ఫోన్ ధర కేవలం రూ. 6,299. తక్కువ ధర ట్యాగ్ ఉన్నప్పటికీ, ఈ స్మార్ట్‌ఫోన్ ఉత్తమ ఫీచర్లను అందిస్తుంది. వీటిలో 6.52-అంగుళాల హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ డిస్‌ప్లే, హీలియో జీ36 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుంది.  5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉన్నాయి. అతి తక్కువ ధరలో కావాలనుకొనే వారికి బెస్ట్ చాయిస్ ఇది.

3 / 5
శామ్సంగ్ గేలాక్సీ ఎం4.. ఈ ఫోన్ ధర రూ. 8,499గా ఉంది. దీనిలో హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్‌తో పెద్ద 6.5-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. USB టైప్-సి పోర్ట్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 5,000 ఎంఏహెచ్ సామర్థ్యతో బ్యాటరీ ఉంటుంది. ఇది డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

4 / 5
మోటోరోలా ఈ 13.. రూ. 10,000 లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది. దీనిలో 6.5-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. నోకియా సీ32 మాదిరిగానే, ఈ ఫోన్ లో కూడా కనిష్ట బ్లోట్‌వేర్‌తో స్టాక్ ఆండ్రాయిడ్ యూఐ ఉంటుంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ద్వారా 10వాట్ల ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది.

5 / 5
లావా బ్లేజ్ 2.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. లావా బ్లేజ్ 2. ఇది రూ. 10,000లోపు బడ్జెట్ ఫోన్లు చూస్తున్న వారికి బెస్ట్ ఎంపిక.  దీనిలో యూనిసోక్ టీ616 ప్రాసెసర్ తో నడుస్తోంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 6.5-అంగుళాల హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.  ఇది 18W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు  చేస్తుంది. 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది.