వన్ ప్లస్ నోర్డ్ సీఈ 2 లైట్ 5G .. మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ కెమెరా ఫోన్లలో ఇది ఒకటి. దీని ధర ప్రముఖ ఈ ప్లాట్ ఫారం అమెజాన్లో రూ.18,990గా ఉంది. ఈ ఫోన్ వెనక వైపు 64ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ మూడు కెమెరాల సెటప్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన కెమెరా ద్వారా తీసిన ఫోటోల నాణ్యత బాగుంది. కొన్ని షూటింగ్ మోడ్‌లను కూడా అందిస్తుంది. ఇంకా, ముందువైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
రెడ్ మీ నోట్ 11టీ 5జీ.. ఈ ఫోన్ వెనుక వైపు 50ఎంపీ ఏఐ కెమెరా ఉంటుంది. అలాగే 8ఎంపీ మరో కెమెరా ఉంటుంది. దీని ద్వారా పోర్ట్ రైట్, పనోరమా, ప్రో మోడ్, నైట్ మోడ్, ఏఐ వాటర్ మార్క్, హెచ్ డీఆర్, ఏఐ సీన్ డిటెక్షన్, గూగుల్ లెన్స్, మూవీ ఫ్రేమ్, ప్రో కలర్, కలర్ ఫోకస్ అనే ఫీచర్లుంటాయి. ముందు వైపు 16ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది. ఈ రెడ్ మీ నోట్ 11టీ ధర ఈ ప్లాట్ ఫారం అమెజాన్లో రూ. 16,999గా ఉంది.
రెడ్ మీ నోట్ 11ఎస్.. ఇది వెనుక వైపు క్వాడ్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంటుంది. 108ఎంపీ వైడ్ యాంగిల్ మెయిన్ కెమెార, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 2ఎంపీ మాక్రో కెమెరా, 2ఎంపీ డెప్త్ కెమెరాలు ఉంటాయి. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్, డిజిటల్ జూమ్, డచ్ టూ ఫోకస్, ఎక్స్ పోజర్ కంపన్సేషన్, ఐఎస్ఓ అడ్జస్ట్మెంట్ హెచ్డీఆర్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ధర అమెజాన్లో రూ. 16,499గా ఉంది.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ.. దీని ధర అమెజాన్లో రూ. 19,999గా ఉంది. దీనిలో కూడా ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ని కలిగి ఉంది. టైటానిక్ 108ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2ఎంపీ వైడ్ యాంగిల్, 2ఎంపీ డెప్త్ కెమెరాలు ఉంటాయి. ఉంటుంది. పోర్ట్ రైట్, ఫేస్ షార్పెనింగ్, హైయ్యర్ క్వాలిటీ, అడ్జస్ట్ బుల్ రీ టచింగ్, నన్యూ బోకే ఫ్లేర్ ఫిల్టర్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబిలైజేషన్(ఈఐఎస్) డ్యూయల్ వ్యూ వీడియో వంటి ఫీచర్లు ఉంటాయి. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
ఒప్పో ఏ78 5జీ.. ఈ స్మార్ట్‌ఫోన్ ధర అమెజాన్ లో రూ.18,999గా ఉంది. ఈ ఫోన్ వెనక వైపు 50ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇక ముందువైపు కెమెరా విషయానికి వస్తే 13MP సెల్ఫీ కెమెరా ను కలిగి ఉంటుంది. ఏఐ పోర్ట్ రైట్ రీ టచింగ్, పోర్ట్ రైట్ మోడ్, మోనోక్రోమ్ వీడియో వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.