Tecno Spark Go: రూ. 6వేలకే అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ కూడా..

|

Dec 06, 2023 | 12:45 PM

స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ నేపథ్యంలో ఫోన్‌ల ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. మరీ ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు తక్కువ బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. టెక్నో స్పార్క్‌ గో పేరుతో తక్కువ ధరలో ఈ ఫన్‌ను తీసుకొచ్చారు..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ టెక్నో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. టెక్నో స్పార్క్‌ గో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 3జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ ధర రూ. 6.699గా నిర్ణయించారు.

2 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో కూడా తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఎహెచ్‌ కెపాసిటీగల బ్యాటరీని అందించారు.

3 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో గ్రావిటీ బ్లాక్, మిస్టరీ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో తీసుకురానున్నారు. ఇప్పటికే అధికారికంగా లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ డిసెంబర్‌ 7వ తేదీ నుంచి అమెజాన్‌తో పాటు రిటైల్ ఔట్‌లెట్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు

4 / 5
టెక్నో స్పార్క్‌ గో ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం.

5 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ ఈ ఫోన్‌ సొంతం.