
మొబైల్ ఫోన్‌ల తయారీలో కంపెనీలు రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్నాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్, రోలబుల్ స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి.

అయితే తాజాగా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టీసీఎల్ ఈ రెండు ఫీచర్లను కలిపి ఒకే మొబైల్‌లో తీసుకువస్తోంది.

టీసీఎల్ ఓవైపు ఫోల్డబుల్, మరోవైపు రోలబుల్ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్‌ను రూపొందించే పనిలో పడింది.

ఈ ఫోన్ సైజ్‌ను అడ్జెస్ట్ చేసుకోవడం ద్వారా స్మార్ట్ ఫోన్, ఫ్యాబ్లెట్, ట్యాట్లెట్‌గా మార్చుకోవచ్చు.

ఈ ఏడాది చివర్లో ఈ ఫోన్ ప్రంపంచ మార్కెట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు సమాచారం.

విభిన్న కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఇతర ఫీచర్లు గురించి తెలియాల్సి ఉంది.