High Speed Ceiling Fans: ఈ ఫ్యాన్స్‌తో ఇంట్లోనే తుఫాన్‌.. మీ బెడ్‌రూమ్‌కు సెట్‌ అయ్యే బెస్ట్‌ సీలింగ్‌ ఫ్యాన్స్‌ ఇవే

|

Aug 22, 2023 | 9:30 PM

సాధారణంగా మనం బయట నుంచి ఇంట్లోకి రాగానే మొదటగా చేసే ఫ్యాన్‌ స్విచ్‌ ఆన్‌ చేసుకోవడం. ఫ్యాన్‌ అనేది ప్రస్తుత రోజుల్లో నిత్యావసరంగా మారింది. గతంలో సింపుల్‌గా ఉండే సీలింగ్‌ ఫ్యాన్‌ డెకరేషన్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అందంగా ఉండే ఫ్యాన్‌లు గాలి విషయంలో మాత్రం నిరుత్సాహపరుస్తున్నాయి. కాబట్టి తక్కువ ధరకే కనులకు ఇంపుగా ఉండడంతో పాటు గాలి విషయంలో కూడా వినియోగదారులకు సపోర్ట్‌ చేసే బెస్ట్‌ సీలింగ్‌ ఫ్యాన్స్‌ మార్కెట్‌లో చాలా అందుబాటులో ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రజాదరణ పొందిన కొన్ని సీలింగ్‌ ఫ్యాన్స్‌ ఏవో? ఓ సారి తెలుసుకుందాం.

1 / 5
హావెల్స్‌ ఆంబ్రోస్‌ 1200 ఎంఎం సీలింగ్‌ మెటాలిక్‌ పెయింట్‌ డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఫ్యాన్‌ నిమిషానికి 238 క్యూబిక్‌ మీటర్ల ఎయిర్‌ డెలివరీ రేట్‌ను అందిస్తుంది. 65 X 100 చదరపు అడుగుల ప్రాంతాన్ని ఈ ఫ్యాన్‌ స్వీప్‌ చేస్తుంది. అలాగే ఈ మోటర్‌ చాలా తక్కువ ఓల్టేజీతో పని చేస్తుంది. ఈ ఫ్యాన్‌ డ్యుయల్‌ టోన్‌ కలర్‌ స్కీమ్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఫ్యాన్‌ ధర రూ.2325గా ఉంటుంది.

2 / 5
ధూమ్ 1200 ఎంఎం హై-స్పీడ్ సీలింగ్ ఫ్యాన్ తక్కువ-సాంద్రత కలిగిన అల్యూమినియంతో తయారు చేశారు. ఇది సైలెంట్ ఆపరేషన్‌లో సహాయపడుతుంది. అలాగా ఈ సీలింగ్ ఫ్యాన్‌ను తేలికగా ఉండేలా చేసి, అత్యుత్తమ ఎయిర్ త్రో, దీర్ఘకాల మన్నికను అందిస్తుంది. శక్తివంతమైన మోటారు 370 ఆర్‌పీఎం వద్ద పని చేస్తుంది. వైట్‌ బాడీపై గోల్డ్‌ ట్రిమ్‌తో వచ్చే ఈ ఫ్యాన్‌ డిజైన్‌ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా గ్రేడ్ కాపర్ వైండింగ్ వైర్ అత్యుత్తమ పనితీరును అందించడంలో ఈ ఫ్యాన్‌ మెరుగ్గా సహాయపడుతుంది. ఈ ఫ్యాన్‌ ధర రూ.2999.

3 / 5
మార్కెట్‌లోని అత్యంత సౌందర్య, అలంకార సీలింగ్ ఫ్యాన్‌లలో ఒకటైన ఉషా బ్లూమ్ డాఫోడిల్ గుడ్‌బై డస్ట్ సీలింగ్ ఫ్యాన్ ప్రతి ఇంటికి ఒక అద్భుతమైన ఎంపికగా ఉంటుంది. ఈ ఫ్యాన్ ఆకర్షణీయమైన రంగులలో వస్తుంది. కాబట్టి మీరు మీ స్థలం సెట్టింగ్‌కు సరిపోయే రంగును సులభంగా ఎంచుకోవచ్చు. ఉషా బ్లూమ్ డాఫోడిల్ శక్తివంతమైన మోటారుతో వస్తుంది. నోవెల్ సిలేన్ పెయింట్ టెక్నాలజీతో డస్ట్ రెసిస్టెంట్‌తో పాటు ఆయిల్, వాటర్ రెసిస్టెంట్, స్క్రాచ్, స్టెయిన్ రెసిస్టెంట్‌ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫ్యాన్‌ ధర రూ.2899గా ఉంది.

4 / 5
ఉషా స్పెక్టర్‌ గెలాక్సీ 1200 ఎంఎం సీలింగ్‌ ఫ్యాన్‌ సూపర్‌ మోటర్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. 385 ఆర్‌పీఎంతో పని చేసే ఈ ఫ్యాన్‌ 240 సీఎంఎంతో వస్తుంది. సిలెన్‌ పెయింట్‌తో వచ్చే ఈ ఫ్యాన్‌ ఆయిల్‌, డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా వస్తుంది. ఈ ఫ్యాన్‌పై బల్క్‌ బై డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. ఈ ఫ్యాన్‌ ధర రూ.2887గా ఉంది.

5 / 5
వీ గార్డ్‌ విండిల్‌ ప్రో ఫ్యాన్‌ 1200 ఎంఎం బ్లేడ్‌లతో వస్తుంది. ఈ ఫ్యాన్‌ లివింగ్‌ ఏరియాతో పాటు బెడ్‌ రూమ్స్‌లో సరిగ్గా సరిపోతుంది. ఈ ఫ్యాన్‌లో ప్రత్యేకంగా స్టెలార్‌ మోటర్‌ను ఉపయోగించారు. కాబట్టి ఇది ఎక్కువ రోటేటింగ్‌ స్పీడ్‌తో పని చేస్తుంది. డబుల్‌ బేరింగ్‌ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫ్యాన్‌ ధర రూ.1799గా ఉంటుంది.