Redmi Smart Watch: రెడ్‌మీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌లు వచ్చేస్తున్నాయి.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

|

Jan 01, 2023 | 12:15 PM

చైనాకు చెందిన దిగ్గజ సంస్థ రెడ్‌మీ తాజాగా రెండు కొత్త స్మార్ట్‌ వాచ్‌లను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీ బ్యాండ్‌2, రెడ్‌మీ వాచ్‌3 పేరుతో వాచ్‌లను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్‌ వాచ్‌లో ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రెడ్‌మీ తాజాగా రెండు స్మార్ట్‌ వాచ్‌లను లాంచ్‌ చేస్తోంది. వీటిలో ఒకటి స్మార్ట్‌ వాచ్‌ కాగా, మరొకటి రెడ్‌ మీ బ్యాండ్‌. రెడ్‌మీ వాచ్‌3, రెడ్‌మీ బ్యాండ్‌ 2 పేరుతో తీసుకొచ్చిన ఈ గ్యాడ్జెట్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

2 / 5
రెడ్‌మీ బ్యాండ్‌2లో 172×320 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన 1.47 ఇంచెస్‌ కలర్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఇందులో 210 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 14 రోజుల పాటు నిర్విరామంగా పని చేస్తుంది.

3 / 5
రెడ్‌ మీ బ్యాండ్‌ 2 వంద వరకు బ్యాండ్‌ ఫేస్‌లకు సపోర్ట్‌ చేస్తుంది. వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ కోసం 5ఏటీఎమ్‌ సర్టిఫికేట్‌ అందించారు. హార్ట్‌ బీట్‌, స్లీపింగ్‌ ట్రాక్‌, పీరియడ్స్‌ సైకిల్‌ మానిటరింగ్‌ వంటి హెల్తీ ఫీచర్లను అందించారు.

4 / 5
ఇక రెడ్‌మీ వాచ్‌ 3 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 1.75 ఇంచెస్‌ ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఇందులో 289 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 12 రోజులపాటు పని చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 390×450 పిక్సెల్స్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు.

5 / 5
ధర విషయానికొస్తే రెడ్‌మీ బ్యాండ్‌ 2 స్మార్ట్‌వాచ్‌ ధర రూ. 2000 కాగా రెడ్‌మీ వాచ్‌ 3 ధర రూ. 7000గా ఉండనుంది. అయితే ఈ స్మార్ట్‌ వాచ్‌లు మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయన్నదానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.