- Telugu News Photo Gallery Technology photos Realme launching new smartphone Realme Narzo 70 Curv features and price details
Realme Narzo 70 Curve: రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతో తెలుసా.?
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ రియల్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రియల్‌మీ నార్జో 70 కర్వ్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి..
Updated on: Nov 17, 2024 | 1:23 PM

భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. చైనాకు ఎలక్ట్రానిక్ దిగ్గజం రియల్‌మీ నార్జో సిరీస్‌లో భాగంగా కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రియల్ మీ నార్జో 70 కర్వ్ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.

ఈ ఫోన్‌ను కర్వ్‌డ్ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నట్లు కంపెనీ పేరుతోనే స్పష్టం చేసింది. 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెట్ రేట్‌తో ఈ స్క్రీన్ రానుంది.

ఇక ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్‌లో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇ్వనున్నారు.

ఇక ధర విషయానికొస్తే రియల్‌మీ నార్జో 70 కర్వ్ ఫోన్ రూ. 15 నుంచి రూ. 20 వేల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ బేస్ వేరింట్ రూ. 15 వేలలో లభించే అవశాలు ఉన్నట్లు తెలుస్తోంది.




